దేశ ప్రగతికి వేగుచుక్క.. ఎన్నికల సిరాను తయారు చేసేది మన హైదరాబాద్‌లోనే..

Election Ink in Hyderabad: ప్రజా స్వామ్యంలో ఓటు హక్కును వజ్రాయుధంతో పోల్చారు రాజ్యాంగ నిపుణులు. ఒక్క ఓటుతో చరిత్రలు.. తల రాతలు మార్చిన ఘటనలు ఉన్నాయి. ఓటు వేయడానికి ముందు వేసే సిరా చుక్కకు ఎంతో చరిత్ర ఉంది.

Election Ink in Hyderabad: ప్రజా స్వామ్యంలో ఓటు హక్కును వజ్రాయుధంతో పోల్చారు రాజ్యాంగ నిపుణులు. ఒక్క ఓటుతో చరిత్రలు.. తల రాతలు మార్చిన ఘటనలు ఉన్నాయి. ఓటు వేయడానికి ముందు వేసే సిరా చుక్కకు ఎంతో చరిత్ర ఉంది.

ఎన్నికల్లో ఓటు మాత్రమే కాదు.. సిరా చుక్కది కూడా కీలక పాత్రే. అందుకే ఓ కవి అంటాడు.. ‘నీ వేలిపై సిరా చుక్క దేశ ప్రగతికి వేగు చుక్క’. సామాన్యు నుంచి సెలబ్రెటీల వరకు ఎన్నికల రోజు తాము ఓటు వేసినట్లు సినా చుక్కతో ఉన్న వేలిని చూపిస్తుంటారు. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం సిరా చుక్క. భారత్ తో పాటు ఇతర దేశాల్లో ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం ఆనవాయితీ చేశారు. దేశ గతిని మార్చే ఓటు.. ఆ ఓటు వేసినట్లు ఖరారు చేసే సిరా చుక్క మన హైదరాబాద్ లోనే తయారు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం నిబంధన 37 ప్రకారం ఓటు వేసిన వ్యక్తికి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పెడ్తారు. ఈ సిరా చుక్క పెట్టే పద్దతిని 1962 లో ప్రవేశ పెట్టింది ఎన్నికల సంఘం. సిరా చుక్క బాటిల్ ని భారత ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలకు సరఫరా చేస్తుంది.

ఎన్నికల సమయంలో వాడే సిరా చుక్కను మొదట కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ వారు తయారు చేసి సరఫరా చేసేవారు. భారత్ లో ఎక్కడ ఎన్నికల జరిగినా ఇక్కడ నుంచే సరఫరా అయ్యేది. ఆ తర్వాత 1990 నుంచి సిరా చుక్క తయారీ హైదరాబాద్ లో మొదలైంది. ఉప్పల్ లోని రాయుడు లాబరేటీస్ అనే సంస్థ ఎన్నికల సంఘం కి సిరా చుక్క సప్లై చేస్తుంది. మైసూర్ కంపెనీతో పోల్చితే ఇది చిన్న సంస్థ అయినప్పటికీ.. దేశాల్లోని ఎన్నికల కోసం దాదాపు వంద దేశాలకు ఇండెలబుల్ ఇంక్ ని సప్లై చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిథులు తెలిపారు. భారత్ తో పాటు శ్రీలంక, నైజీరియా, మాల్దీవులు, ఇథియోపియా, జాంబియా, దక్షిణాఫ్రిక, ఈస్టర్ తిమోర్ తదితర దేశాలకు పంపిణీ చేస్తున్నామని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ సిరాలో వాడే సిల్వర్ నైట్రెట్ పర్సెంటేజ్ బట్టి చెరిగిపోయే సమయం ఉంటుందని తెలిపారు. ఈ ఇంక్ ని 5 ఎంఎల్, 10 ఎంఎల్, 25 ఎంఎల్, 50 ఎంఎల్, 60 ఎంఎల్, 100 ఎంఎల్ పరిమాణంలో ఉండే బాటిల్స్ లో తయారు చేసి రెడీ చేస్తామన్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘానికి 5 ఎంఎల్ బాలిటిల్స్ ని సరఫరా చేస్తున్నామన్నారు. ఒక బాటిల్ దాదాపు 300 మందికి సరిపోతుందని తెలిపారు. ఇటీవల బిహార్ పంచాయతీ ఎన్నికల్లో సిరాకు బదులు మార్కర్స్ ఆర్డర్స్ వచ్చినట్లు రాయుడు ల్యాబరేటీస్ తెలిపింది. ఈ కంపెనీలో ప్రస్తుతం 25 మంది స్టాఫ్ పనిచేస్తున్నారని ఏడాదికి దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు సంస్థ టర్నోవర్ ఉంటున్నట్లు సమాచారం.

Show comments