iDreamPost
android-app
ios-app

వెలుగులోకి మరో కొత్త UPI మోసాలు.. వేరే ఖాతాకు డబ్బు బదిలీ చేశామంటూ..

  • Published Sep 09, 2024 | 3:14 PM Updated Updated Sep 09, 2024 | 3:14 PM

Hyderabad Cyber Crime: నగరంలో ఇప్పటి వరకు దేనిని విడిచిపెట్టాకుండా మోసాలకు పాల్పడుతున్న రకరకాల ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. కానీ, తాజాగా ఇప్పుడు మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. దీని వల్ల సైబర్ కేటుగాళ్లు భారీగానే మోసాలకు పాల్పడుతున్నారు. మరీ, ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

Hyderabad Cyber Crime: నగరంలో ఇప్పటి వరకు దేనిని విడిచిపెట్టాకుండా మోసాలకు పాల్పడుతున్న రకరకాల ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. కానీ, తాజాగా ఇప్పుడు మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. దీని వల్ల సైబర్ కేటుగాళ్లు భారీగానే మోసాలకు పాల్పడుతున్నారు. మరీ, ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

  • Published Sep 09, 2024 | 3:14 PMUpdated Sep 09, 2024 | 3:14 PM
వెలుగులోకి మరో కొత్త UPI మోసాలు.. వేరే ఖాతాకు డబ్బు బదిలీ చేశామంటూ..

దేశంలో సైబర్ నేరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈజీగా డబ్బును ఎలా సంపాదించాలనే నేపథ్యంలో.. చాలామంది కేటుగాళ్లు రోజుకొక మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇక వీరి అత్యాశకు అమాయకపు ప్రజలు నిలువున మోసపోతున్నారు. ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్ల లిస్ట్ లో సామన్యులు, సెలబ్రిటీస్ , ప్రభుత్వ అధికారులు అనే తేడా లేకుండా.. ప్రతిఒక్కరిని టార్గెట్ చేస్తూ వారి దగ్గర లక్షల రూపాయాలు కొల్లగొడుతున్నారు. అయితే ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్లు..ఈ కేవైసీలు,కొరియర్‌ ఫార్శిల్స్‌, డ్రగ్స్ పార్శిల్, ఢీప్‌ ఫేక్‌ ఫోటోలు, డ్రగ్స్ పేరిట దీనిని విడిచిపెట్టకుండా మోసాలకు పాల్పపడిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. కానీ, తాజాగా ఇప్పుడు మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అదే యూపీఐ పేమెంట్స్ మోసం. దీని వల్ల సైబర్ కేటుగాళ్లు భారీగానే మోసాలకు పాల్పడుతున్నారు. మరీ, ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

నగరంలో యూపీఐ పేమెంట్స్ అనే కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ భారీ కుంభకోణంలో ఇప్పటి వరకు రూ.4 కోట్లు కొల్లగొట్టిన రాజస్థాన్ సైబర్ కేటుగాళ్లను తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక వీళ్లంతా హైదరాబాద్ లో ముఠాగా ఏర్పడి బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను టార్గెట్ గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తాజాగా  సైబరాబాద్ డీసీపీ నరసింహ తెలిపారు. ఇకపోతే ఈ ముఠాలో మొత్తం 13 మంది నిందితులు ఉన్నారని, పైగా ఒక్కొక్కరి దగ్గర రూ.1.72 లక్షల నగదు, 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నమని పోలీసులు తెలిపారు. అలాగే శంషాబాద్ సిసిఎస్, కేపీహెచ్బీ, మాదాపూర్, నార్సింగి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ భాగంలో ఈ నిందితులను అదుపులో తీసుకున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ డీసీపీ నరసింహ మాట్లాడుతూ.. బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను టార్గెట్ చేసుకొని, యూపీఐ మోసాలకు పాల్పడుతున్న ఈ రాజాస్థాన్ ముఠా.. మొదట ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేందుకు నగరంలో పలు షోరూంలోకి వెళ్తున్నారు. ఇక అక్కడ విలువైన వస్తువులు కొనుగోలు చేశాక, యూపీఐ ద్వారా నగదును చెల్లింపులు చేయడానికి బజాజ్ షోరూమ్ లో క్యూఆర్ కోడ్ ను ఆ ముఠాలో సహచారులకు పంపుతూ నగదును చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఎలక్ట్రానిక్ వస్తువులు డెలివరీ అయ్యాక.. పొరపాటున వేరే ఖాతాకు ఖాతాకు డబ్బు బదిలీ చేశామంటూ తెలివిగా బ్యాంకుకు ఆశ్రయిస్తున్నారు. అలా చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బు పొందుతూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ మోసాలకు పాల్పడిన వారిలో ఎక్కువగా న 20 నుంచి 25 ఏళ్ల వయసు యువకులు కావడం గమన్హారం.

మరోపక్క యూపీఐ మోసాల ద్వారా కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఇతరులకు అమ్మి ఈ ముఠా సొమ్ము చేసుకుంటుందన్నారు. ఇలా  గత రెండు నెలలుగా ఈ ముఠా  1,125 యూపీఐ ట్రాన్స్‌యాక్షన్స్‌  చేశారన్నారు. అయితే ఈ సైబర్ ముఠాకు సంబంధించి త్వరలోనే  రాజస్థాన్ కు ప్రత్యేక టీమ్ లను పంపిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా.. ఈ క్రైమ్ వెనకాల ఉన్న అసలైన వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటమని పేర్కొన్నారు.