iDreamPost
android-app
ios-app

దుబాయ్‌లో జైలు జీవితం… 18 ఏళ్ల తర్వాత సొంతూరికి సిరిసిల్ల వాసులు

  • Published Feb 21, 2024 | 7:16 PM Updated Updated Feb 21, 2024 | 7:16 PM

Prison Life in Dubai: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి అక్కడ జైల్లో సుదీర్ఘ కాలం శిక్ష అనుభవించిన ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి లభించింది.

Prison Life in Dubai: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి అక్కడ జైల్లో సుదీర్ఘ కాలం శిక్ష అనుభవించిన ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి లభించింది.

దుబాయ్‌లో జైలు జీవితం… 18 ఏళ్ల తర్వాత సొంతూరికి సిరిసిల్ల వాసులు

దేశంలో ఎంతోమంది ఉపాధి కోసం విదేశాలకు వెళ్తుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి స్వదేశానికి తిరిగి వచ్చి మంచి జీవితం గడపాలని అనుకుంటారు. సాధారణంగా ఒక్కో దేశంలో ఒక్కోవిధంగా చట్టాలు ఉంటాయి. గల్ఫ్ దేశాల్లో మాత్రం చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. ఏ చిన్న తప్పు చేసినా నిర్ధాక్షిణ్యంగా జైల్లో వేస్తారు. ఉపాధి అవకాశాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది దుబాయ్ కి వెళ్తుంటారు. అక్కడ తెలిసీ తెలియని నేరాలకు దారుణమైన శిక్షలు అనుభవిస్తుంటారు. ఓ హత్య కేసులో ఇరుక్కొని 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన తెలంగాణ వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. వివరాల్లోకి వెళితే..

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. ఊహించని విధంగా నేపాల్ కి చెందిన వాచ్‌మెన్ బహదూర్ సింగ్ అనే వ్యక్తి హత్య కేసులో నేరస్థులుగా మారారు. ఈ కేసులో పది మందిపై ఆరోపణలు రాగా.. తెలంగాణకు చెందిన దుండిగల్ లక్ష్మణ్, నాంపల్లి వెంకటి, జిగిత్యాల జిల్లాకు చెందిన అన్నదమ్ములు శివరాత్రి హన్మంత్, శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవిలను హత్య కేసులో దోషులుగా నిర్ధారించారు పోలీసులు. మొదట పదేళ్లు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు.. నేరం రుజువు కావడంతో ఆ శిక్షను 25 ఏళ్లకు పెంచింది. అప్పటి నుంచి జైల్లో నరకం అనుభిస్తూ వచ్చారు ఈ ఐదుగురు. మరోవైపు సంపాదించే పెద్ద దిక్కు లేక కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ విషయం మీడియా ద్వారా 2011 లో కేటీఆర్ దృష్టికి వెళ్లింది.

దుబాయ్ జైల్లో ఐదుగురిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే స్వయంగా నేపాల్ కు వెళ్లి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ఇచ్చి క్షమాభిక్ష రాయించారు. గత ఏడాది దుబాయ్ లో పర్యటించిన కేటీఆర్ అక్కడ ప్రభుత్వానికి ఈ విషయంపై విజ్ఞప్తి చేశారు. క్షమాభిక్ష పిటీషన్ కు యూఏఈ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడంతో వలస కార్మికులు స్వదేశానికి రావడానికి మార్గం సుగమం అయ్యింది. ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం జిగ్యాలకు చెందిన హన్మంతు ఇటీవల 17న ఇటికి చేరుకున్నాడు. చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి వచ్చే నెలలో జైలు నుంచి విడుదల కానున్నాడు.  దుబాయ్ నుంచి బుధవారం సిరిసిల్ల, రుద్రంగి, కోనరావు పేట మండలాలకు చెందినవారు హైదరాబాద్ వచ్చారు. 18 ఏళ్లు జైలులో నరకయాతన అనుభవించిన వీరు తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో భావోద్వేగ వాతావరణం నెలకొంది. దుబాయ్ నుంచి తెలంగాణ తిరిగొచ్చేందుకు కేటీఆర్ విమాన టికెట్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.