P Krishna
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇటీవల మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేసింది. ఈ పథకాలకు మంచి స్పందన లభిస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇటీవల మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేసింది. ఈ పథకాలకు మంచి స్పందన లభిస్తుంది.
P Krishna
తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ రెండు పథకాలు అమలు చేశారు. ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా ఏర్పాటు చేసి ప్రజా వాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతివారం మంచి స్పందన వస్తుంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు కోసం ధరఖాస్తు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభించారు. తొలిరోజే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీమ్స్ తో ప్రజల్లోకి వెళ్లింది. ఆరు గ్యారెంటీలపై నమ్మకంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి జనం పోటెత్తారు. అయితే పథకాల నిబంధనలపై కొంతమంది అయోమయానికి గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో కొన్నిచోట్ల దరఖాస్తు ఫారాలు డబ్బులు చెల్లించి బయట కొనుగోలుచేశారు. ఈ క్రమంలోనే దరఖాస్తులు ఉచితంగా ఇస్తామని.. ఎవరైనా బయట అమ్మినట్లు దృష్టిలోకి వస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎస్ శాంతకుమారి హెచ్చరించారు . గ్యారెంటీ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే ఏకంగా 7 లక్షల 46 వేల 414 దరఖాస్తులు వచ్చాయి. మొదటి రోజుల ప్రజా పాన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వచ్చిందని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అభయ హస్తం కింద ఆరు గ్యారెంటీ పథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తులకు రేషన్ కార్డులను జతచేయాలని అధికారులు సూచించారు. ఒకవేళ రేషన్ కార్డులు లేని వారు తెల్లకాగితంపై వినతి పత్రాలను సమర్పించాలని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. గ్రామాలు, వార్డులు, డివిజన్ల వారీగా ప్రజాపాలన సభలను నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఈ సభలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానికు ప్రజాల ప్రతినిధులు, అధికారులు హాజరు కావడంతో భారీ స్పందన లభించింది. డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ఈ ప్రజా పాలన కార్యక్రమం జనవరి 6 వ తేదీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. అర్హులైన వారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.