iDreamPost
android-app
ios-app

HYDలో రామేశ్వరం కేఫ్ ప్రారంభం.. కస్టమర్లకు ఫ్రీగా టిఫిన్స్.. ఎప్పటిదాకంటే?

ఆహార ప్రియులకు అదిరిపోయే ఆఫర్. హైదరాబాద్ నగరంలో ప్రముఖ కేఫ్ ఉచితంగానే టిఫిన్స్ అందిస్తోంది. మీకు నచ్చిన టిఫిన్స్ ఫ్రీగా తినేయొచ్చు. ఇంతకీ ఆ కేఫ్ హైదరాబాద్ లో ఎక్కడుందో తెలుసా? అప్పటి వరకు ఫ్రీగా అందించనున్నారు.

ఆహార ప్రియులకు అదిరిపోయే ఆఫర్. హైదరాబాద్ నగరంలో ప్రముఖ కేఫ్ ఉచితంగానే టిఫిన్స్ అందిస్తోంది. మీకు నచ్చిన టిఫిన్స్ ఫ్రీగా తినేయొచ్చు. ఇంతకీ ఆ కేఫ్ హైదరాబాద్ లో ఎక్కడుందో తెలుసా? అప్పటి వరకు ఫ్రీగా అందించనున్నారు.

HYDలో రామేశ్వరం కేఫ్ ప్రారంభం.. కస్టమర్లకు ఫ్రీగా టిఫిన్స్.. ఎప్పటిదాకంటే?

ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చాలా మంది టిఫిన్స్ కోసం, ఫుడ్ కోసం ఎక్కువగా హోటల్స్ ను ఆశ్రయిస్తున్నారు. రేటు కాస్త ఎక్కువైనా సరే టిఫిన్ సెంటర్స్, హోటల్స్ లోనే ఆకలి తీర్చుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆహార ప్రియులకు గుడ్ న్యూస్. నయా పైసా ఖర్చు లేకుండా టిఫిన్స్ చేసేయొచ్చు. అదేలా అంటారా? హైదరాబాద్ నగరంలో ప్రారంభమైన ప్రముఖ కేఫ్ లో ఉచితంగా టిఫిన్స్ అందిస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యాజమాన్యం వినూత్నంగా ఫ్రీ ఫుడ్ ట్రయల్ ను ప్రవేశపెట్టింది. ఆ రోజు దాక ఫ్రీ టిఫిన్స్ అందించనున్నారు. ఇంతకీ నగరంలో ఏ ఏరియాలో ఆ కేఫ్ ప్రారంభించారో తెలుసా?

కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ప్రముఖ రామేశ్వరం కేఫ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. యాజమాన్యం తొలిసారిగా హైదరాబాద్ లో తన శాఖను ప్రారంభించింది. మాదాపూర్ లోని క్యాపిటల్ పార్క్ పక్కన ఈ కేఫ్ ను ప్రారంభించారు. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ కు సమీపంలో ఉంది. ఈ కేఫ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రారంభమైంది. అయితే యాజమాన్యం కస్టమర్లకు తమ ఆహార రుచులను తెలియజేసేందుకు ఉచిత టిఫిన్స్ ట్రయల్స్ ను ప్రారంభించింది. జనవరి 18 వరకు ఉచితంగా టిఫిన్స్ అందించనుంది. మీరు రామేశ్వరం కేఫ్ లోని టిఫిన్స్ ను ఉచితంగా పొందాలంటే జనవరి 18 వరకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.

బెంగళూరులో ప్రసిద్ధి చెందిన ఈ రామేశ్వరం కేఫ్ కు కస్టమర్ల తాకిడి ఓ రేంజ్ లో ఉంటుంది. డైలీ 7500 మంది కస్టమర్లు ఈ కేఫ్ కు వస్తారు. 2021లో ప్రారంభమైన ఈ కేఫ్ అనతికాలంలోనే ఫేమస్ హోటల్ గా మారిపోయింది. ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉంటూ.. నెలకు రూ.4 కోట్ల వరకు బిజినెస్ చేస్తోంది. దివ్య, రాఘవేంద్రరావు అనే జంటకు అబ్దుల్‌ కలాం అంటే ఎంతో ఇష్టం. దీంతో కలాం స్వస్థలం అయిన రామేశ్వరం పేరు మీద ఈ హోటల్ ప్రారంభించారు. మరి హైదరాబాద్ లో రామేశ్వరం కేఫ్ ప్రారంభించిన సందర్భంగా ఫ్రీగా టిఫిన్స్ అందిస్తుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.