iDreamPost
android-app
ios-app

డబ్బులు పంచుతు అడ్డంగా దొరికిన పోలీస్ అధికారి!

ఓటర్లకు లీడర్లు డబ్బులు పంచుతూ దొరకడం కామన్. కానీ, ఓ పోలీస్ అధికారి డబ్బులు పంచడం ఎప్పుడైన చూశారా?

ఓటర్లకు లీడర్లు డబ్బులు పంచుతూ దొరకడం కామన్. కానీ, ఓ పోలీస్ అధికారి డబ్బులు పంచడం ఎప్పుడైన చూశారా?

డబ్బులు పంచుతు అడ్డంగా దొరికిన పోలీస్ అధికారి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. నిన్నటితో ఎన్నికల ప్రచారానిక కూడా తెర పడింది. దీంతో లీడర్లు ప్రజలను సోషల్ మీడియా ద్వారా ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇక నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇర అదనపు భద్రతతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. దీంతో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఓటింగ్ కు ఒక్క రోజే ఉండడంతో లీడర్లు తెర చాటున ఓటర్లను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారని కొన్ని పార్టీల అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇంతే కాకుండా ఓటర్లను ప్రలోభ పెట్టి డబ్బును కూడా పంచేందుకు సిద్దమవుతున్నారని వారు అన్నారు. ఇకపోతే.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు ఆ డబ్బును అంతా సీజ్ చేశారు. ఇకపోతే, లీడర్లు ఓటర్లకు డబ్బును పంచితే దానికి ఓ లక్క ఉంటుంది. కానీ, ఓ పోలీస్ ఆఫీసర్ డబ్బులు పంచితే దానికేం లెక్క? అవును, మీరు విన్నది నిజమే.

తాజాగా ఎక్సైజ్ పోలీస్ ఇన్స్ పెక్టర్ చెంగచర్ల క్రాస్ వద్ద కారులో డబ్బును తీసుకెళ్తూ ఓ పార్టీ కార్యకర్తలకు అడ్డంగా దొరికారు. దీంతో వాళ్లు అతనిపై దాడి చేసి దాదాపు రూ.6 లక్షలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పిగించారు. ఒక హోదాలో ఉండి ఓ పార్టీకి కొమ్ము కాసి ఇలా డబ్బులు పంచడం ఏంటని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే? ఈ అధికారి ఓ పార్టీ తరుపున డబ్బులు పంచుతున్నట్లు కూడా ఆరోపించారు. ఇక ఈ ఘటనతో సీరియస్ అయిన పోలీస్ ఉన్నతాధికారులు డబ్బులు పంచుతూ దొరికిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఓ పార్టీ తరుపున డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన ఈ పోలీస్ అధికారి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.