Police Firing:హైదరాబాద్‌ శివారులో కాల్పుల కలకలం.! అసలు ఏం జరిగిందంటే!

హైదరాబాద్‌ శివారులో కాల్పుల కలకలం.! అసలు ఏం జరిగిందంటే!

Police Firing: ఇటీవల హైదరాబాద్ లో గ్యాంగస్టర్స్ రెచ్చిపోతున్నారు. రియల్ ఎస్టేట్, సెటిల్ మెంట్స్, భూ కబ్జాలు, కిడ్నాప్ వ్యవహారాలు నిర్వహిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో కాల్పుల కలకలం చర్చనీయాంశం అయ్యింది.

Police Firing: ఇటీవల హైదరాబాద్ లో గ్యాంగస్టర్స్ రెచ్చిపోతున్నారు. రియల్ ఎస్టేట్, సెటిల్ మెంట్స్, భూ కబ్జాలు, కిడ్నాప్ వ్యవహారాలు నిర్వహిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో కాల్పుల కలకలం చర్చనీయాంశం అయ్యింది.

ఈ మధ్య కొంతమండి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఎన్నో నేరాలకు పాల్పపడుతున్నారు. డ్రగ్స్, భూ కబ్జాలు. బెదిరింపులు, సెటిల్ మెంట్స్, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల దందాలకు పాల్పపడుతున్నారు.  గుట్టు చప్పుడు కాకుండా వారి పని కానిచ్చేస్తున్నారు. ఇలాంటి నేరాలపై ఎప్పటికప్పుడు ఇలాంటి నేరస్తులపై పోలీస్ నిఘా ఉంచుతున్నారు. నేరస్తులపై కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారులో శుక్రవారం (జులై 4) ఉదయం గ్యాంగ్‌స్టర్స్ పోలీసులపై దొంగలు దాడికి యత్నించగా పోలీసులు కాల్పులు చేయడం తీవ్ర కలకలం చెలరేగింది.  వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ శివారలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం దొంగతనం చేసి పారిపోతున్న ముఠాను పట్టుకునేందుకు నల్లగొండ పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలోనే దొంగలు పోలీసులపై కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులకు దిగాల్సి ఉంచింది. కాల్పుల సందర్భంగా చుట్టపక్కల జనాలు హడలిపోయారు. మొత్తానికి పోలీసులు దొంగలను పట్టుకొని నల్లగొండకు తరలించినట్లు తెలుస్తుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డ సమీపంలో దోపిడీలకు పాల్పపడుతున్న పార్థు గ్యాంగ్ ని ఛేజ్ చేసి పట్టుకునే క్రమంలో వారు కత్తులతో దాడికి ప్రయత్నించగా గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు. పార్దు గ్యాంగ్ కొంత కాలంగా జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలను టార్గెట్ చేస్తున్నారని.. వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారని అన్నారు. ఈక్రమంలోనే నల్లగొండ జిల్లా పోలీసులు నిఘా పెంచి ఎస్పీ శరత్ స్పెషల్ టీమ్ ని రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారు జామున జాతీయ రహదారిపై దొంగల ముఠా పెట్రోలింగ్ పోలీసుల కంట పడింది.  పార్థు గ్యాంగ్  పట్టుకునేందుకు రాచకొండ, నల్లగొండ పోలీసులు కలిసి వెంబడించారని తెలిపారు. అలా దొంగల ముఠాను వెంబడిస్తూ పెద్ద అంబర్ పేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే.. ఆ గ్యాంగ్‌లో కొంతమంది కత్తులతో తమపై దాడి చేయడానికి ప్రయత్నించగా రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిపారు.  ప్రస్తుతం దొంగల ముఠాను అదుపులోకి తీసుకొని నల్లగొండ స్టేషన్ కి తరలించినట్లు.. మిగతా వారిని పట్టుకునే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Show comments