iDreamPost
android-app
ios-app

BRS నేత సంతోష్‌పై కేసు నమోదు! విషయం ఏంటంటే?

  • Published Mar 24, 2024 | 5:44 PM Updated Updated Mar 24, 2024 | 5:44 PM

Brs Ex Mp Joginapally Santosh: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

Brs Ex Mp Joginapally Santosh: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

BRS నేత సంతోష్‌పై కేసు నమోదు! విషయం ఏంటంటే?

గత ఏడాది చివర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలన కొనసాగించింది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల కు తెలంగాణ ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణలో సీఎం గా రేవంత్ రెడ్డి తనదైన పాలన కొనసాగిస్తున్నారు.   తాజాగా బీఆర్ఎస్ నేత పై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నవయుగ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు తో సంతోష్ కుమార్ పై కేసు నమోదు అయ్యింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో భూ కబ్జా చేశారని కేసు నమోదు అయ్యింది. నకిలీ డ్యాకుమెంట్లతో భూ కబ్జా చేసినట్లు ఆయనపై ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 129/54 లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేయగా వాటికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నెల 21 న నవయుగ కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. జోగినపల్లి సంతోష్ కుమార్ పై 400, 471,447,120 బి రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లే పేర్కొన్నారు.

ఈ విషయంపై సంతోష్ కుమార్ స్పందిస్తూ.. తనపై చేసిన భూ కబ్జా కేసు ఆరోపణలు అవాస్తవం. షేక్ పేటలోని సర్వే నెంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని నేను గతంలో పూర్తి చట్టబద్దంగా కొన్నాను. 2016లో మూడు కోట్ల 81 లక్షల 50 వేలు వెచ్చించి.. బాజాప్తా సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశాను. ఇందులో ఫోర్జరీ అన్న విషయానికి తావేలేదు అని అన్నారు.