iDreamPost
android-app
ios-app

Petrol Bunks: హైదరాబాద్ లో పెట్రోలు బంకులు క్లోజ్.. కారణం ఏంటంటే?

హైదరాబాద్ లో ఉన్న పలు పెట్రోలు బంకులు మూతబడుతున్నాయి. ఎలాంటి సమాచారం లేకుండా ఒకటి తర్వాత ఒకటి పెట్రోలు బంకులను మూసేస్తున్నారు.

హైదరాబాద్ లో ఉన్న పలు పెట్రోలు బంకులు మూతబడుతున్నాయి. ఎలాంటి సమాచారం లేకుండా ఒకటి తర్వాత ఒకటి పెట్రోలు బంకులను మూసేస్తున్నారు.

Petrol Bunks: హైదరాబాద్ లో పెట్రోలు బంకులు క్లోజ్.. కారణం ఏంటంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాహనదారులు అయోమయంలో పడిపోయారు. పెట్రోలు, డీజిల్ కోసం వాహనాలు, ఖాళీ క్యాన్లతో బంకుల ముందు క్యూ కడుతున్నారు. ఈ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడినట్లు చెబుతున్నారు. ఇప్పుడు భాగ్యనగరానికి కూడా ఈ పెట్రోల్, డీజిల్ కొరత ఎఫెక్ట్ తాకుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో పలు బంకులు మూసివేశారు. బంకుల ఎదుట వాహనదారులు బారులు తీరారు. పెట్రోలు, డీజిల్ దొరకకపోతే ఎలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. ట్యాంకర్ల సమ్మె ఎఫెక్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలు, డీజిల్ పై పడుతోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకుల్లో ఆయిల్ షార్టేజ్ వస్తోంది. ట్యాంకర్లు, ట్రక్కుల సమ్మె నేపథ్యంలో అన్ని బంకుల్లో ఉన్న ఇంధన నిల్వలు క్రమేపీ తగ్గుతున్నాయి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తాకుతోంది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్రోలు, డీజిల్ కు కొరత ఏర్పడింది. ఇప్పుడు హైదారాబాద్ లో కూడా బంకులు మూసేస్తున్నారు. ఇప్పటికే పలు పెట్రోలు బంకులను క్లోజ్ చేశారు. పెట్రోలు బంకుల ఎదుట రైతులు, వాహనదారులు బారులు తీరుతున్నారు. ఇంధన కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ముందే బంకులకు వాహనదారులు క్యూ కడుతున్నారు. కొన్ని బంకులు మూసేసి ఉండటంతో వారిలో ఆందోళన మరింత పెరుగుతోంది. ఇంధనం దొరకకపోతే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు ఖాళీ క్యానులతో బంకుల ఎదుట క్యూ కడుతున్నారు. వ్యవసాయ పనులు ఉన్న నేపథ్యంలో ఇంధనం కోసం పడిగాపులు కాస్తున్నారు. డీజిల్ లేకపోతే పనులు ఆగిపోతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కొరత ఎందుకు ఏర్పడింది అనే విషయానికి వస్తే.. ట్యాంకర్లు, ట్రక్కుల సమ్మెతో ఈ కొరత అనేది ఏర్పడింది.

అసలు సమ్మె ఎందుకు?:

ప్రస్తుతం ట్రక్కులు, ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె దేశంలో కలకలం రేపుతోంది. హిట్ అండ్ రన్ కేసులో అమలవుతున్న బ్రిటీష్ కాలంనాటి చట్టాన్ని కేంద్రం రద్దు చేసింది. దాని స్థానంలో మరింత కఠినమైన శిక్షలను తీసుకొచ్చింది. హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలితే రూ.7 లక్షల జరిమానా, పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. ప్రమాదం చేసి డ్రైవర్లు పారిపోకూడదు. కచ్చితంగా పోలీసులకు సమాచారం అందించాలి. అలా చేయకపోవడం కూడా నేరంగానే పరిగణిస్తారు. ఇప్పుడు డ్రైవర్లు అందరూ ఈ చట్టం గురించే నిరసనలు తెలియజేస్తున్నారు. ఇలాంటి కఠిన శిక్షలు విధిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ చట్టంలో మార్పులు తీసుకురావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి.. కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.