iDreamPost
android-app
ios-app

వైద్యుల నిర్వాకం.. పంటి చికిత్స కోసం వెళితే.. అసలు ఏం జరిగిందంటే?

పంటి చికిత్స కోసం వెళితే ఓ యువకుడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. వైద్యుల నిర్వాకం వల్ల ఎంతో భవిష్యత్ ఉన్న 28 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అసలు ఏం జరిగిందంటే?

పంటి చికిత్స కోసం వెళితే ఓ యువకుడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. వైద్యుల నిర్వాకం వల్ల ఎంతో భవిష్యత్ ఉన్న 28 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అసలు ఏం జరిగిందంటే?

వైద్యుల నిర్వాకం.. పంటి చికిత్స కోసం వెళితే.. అసలు ఏం జరిగిందంటే?

హైదరాబాద్ లో ఘోరం చోటుచేసుకుంది. ఓ యువకుడు పంటి చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే ఏకంగా ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది. దంత చికిత్స కోసం వెళ్లిన తమ కుమారుడు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 37లోని ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ లో ఘోరం చోటుచేసుకుంది. ఓ 28 ఏళ్ల యువకుడు పంటి చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. మృతుడిని లక్ష్మీనారాయణ వింజంగా గుర్తించారు. కాగా లక్ష్మీనారాయణ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నారు. అయితే అతను స్మైల్ డిజైనిగ్ కోసం ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ హాస్పిటల్ ను ఆశ్రయించాడు. వైద్య పరీక్షల అనంతరం దంత చికిత్స ప్రారంభించారు వైద్యులు.

చికిత్స సమయంలో డాక్టర్లు అతడికి అనస్థీషియా ఇచ్చారు. అయితే మత్తు మందు మోతాదుకు మించి ఇవ్వడంతో బాధితుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే వింజంను అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించగా.. అక్కడ పరీశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఎఫ్ఎంఎస్ ఆసుపత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు మృతికి దంత వైద్యుడే కారణమని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనస్థీషియా అధిక మోతాదులో ఇవ్వడం కారణంగానే ఈ ఘోరం జరిగిందని, దంత వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.