iDreamPost
android-app
ios-app

Hydలోని ఆ ఏడు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు!

  • Published May 07, 2024 | 1:55 PM Updated Updated May 07, 2024 | 1:55 PM

Urban Heat Islands: తెలంగాణలో ఏప్రిల్ నుంచి ఎండలు బీభత్సంగా మంచిపోతున్నాయి. ఎండ వేడి తట్టుకోలేక చాలా మంది వడదెబ్బతో కన్నుమూస్తున్నారు. ఫ్యాన్లు తిరుగుతున్నా.. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

Urban Heat Islands: తెలంగాణలో ఏప్రిల్ నుంచి ఎండలు బీభత్సంగా మంచిపోతున్నాయి. ఎండ వేడి తట్టుకోలేక చాలా మంది వడదెబ్బతో కన్నుమూస్తున్నారు. ఫ్యాన్లు తిరుగుతున్నా.. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

Hydలోని ఆ ఏడు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు!

తెలంగాణలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం చాలా ప్రాంతాలు నిర్మాణుశ్యంగా మారిపోతున్నాయి. ఉక్కపోతుతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు ఎండ వేడి తట్టుకోలేక ఆల్లల్లాడిపోతున్నారు. ఏప్రిల్ నెల నుంచి ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మే తొలి వారంలో రికార్డు స్థాయిలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ లో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నట్లుంది. ఒకప్పుడు తక్కువ టెంపరేచర్ నమోదయ్యే హైదరాబాద్.. ఇప్పడు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ‘హీట్ ఐలాండ్స్’ పుట్టుకొస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ తో గత కొన్ని సంవత్సరాలుగా లేని ఎండలు ఈ ఏడాది కొడుతున్నాయని అంటున్నారు. దీంతో హైదరాబాద్ లో 7 ప్రాంతాల్లో అర్బన్ హీట్ ఐలాండ్స్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ల్యాండ్ సర్పేస్ టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు నమోదు అవుతున్నట్లు గుర్తించారు. చెట్ల నరికివేత, కాంక్రిట్ నిర్మాణాలు, పొల్యూషన్ ఎఫెక్ట్ కారణంగా వాతావరణం నిప్పుల కుంపటిని తలపిస్తుందని హైదరబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ తాజాగా ఓ రిపోర్ట్ విడుదల చేసింది. భూ ఉపగ్రహ, గుగుల్ ఎర్త్ లో ని ఉష్ణోగ్రతల సమాచారాన్ని విశ్లేషించగా మైలార్ దేవులపల్లి, బీఎన్ రెడ్డి నగర్, మన్సూరాబాద్, పటాన్ చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, హయత్ నగర్ ప్రాంతాల్లో నేల మీద నిలవలేనంతగా భూమి వేడెక్కినట్లు నివేదికలో పేర్కొన్నారు.

పర్యావరణానికి నష్టం చేస్తే.. అది ఎప్పటికేనా మానవ మనుగడకు కష్టతరంగా మారుస్తుందని పెద్దలు చెప్పారు.. కానీ ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవం వల్ల వాతావరణంలోని మార్పులు జరుగుతున్నాయి. పర్యావ చెట్లు నరికివేత, కాంక్రిట్ నిర్మాణాలు పెరిగిపోతుంటే.. మరిన్ని హిట్ ఐలాండ్లు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికేసా ప్రజలు మేల్కొని  సాధ్యమైనంత వరకు ఇండ్లలో, ఖాళీ స్థలాల్లో చెట్ల పెంపకం చేపడితే కొంత వరకు టెంపరేచర్లు తగ్గించవొచ్చని అంటున్నారు.  లేదంటే ముందు తరాల వారికి మరింత కష్టజీవితం అందించినవాల్లమవుతామని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.