iDreamPost
android-app
ios-app

ఎంతకు తెగించార్రా.. పశువుల కొవ్వుతో వంటనూనె తయారీ.! ఎక్కడో కాదు..

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు వంటివాటిపై చేసిన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు వంటివాటిపై చేసిన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఎంతకు తెగించార్రా.. పశువుల కొవ్వుతో వంటనూనె తయారీ.! ఎక్కడో కాదు..

కొన్ని రోజుల క్రితం వరకు అందరూ బయట ఫుడ్  ను తెగలాగించే వారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్ ప్రాధాన్యంత ఇస్తారు. ప్రత్యేక సందర్భాలు, వారంతపు సెలవుల్లో ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి హోటళ్లకు, రెస్టారెంట్లకి వెళ్తుంటారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన వరుస దాడులతో అందరిలో ఓ భయం మొదలైంది. బయట ఏది తిన్నాలన్న ఒకటి, రెండు సార్లు కాదు, ఏకంగా  వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి దాకా హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో చోట దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా  పశువుల కొవ్వుతో వంటనూనె తయారు చేసి.. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు వంటివాటిపై చేసిన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నాణ్యతకు, రుచికి మారు పేరు అంటూ ఊదరగొట్టే..ఫేమస్ హోటళ్లు రెస్టారెంట్లలోనే ఫుడ్ సేఫ్టీ గా లేదని తనిఖీల్లో తేలింది. ఇక ఔట్ సైడ్ ఫుడ్ తినడం అంటేనే అనారోగ్యాన్ని డబ్బులిచ్చి మన శరీరంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఫేమస్ రెస్టారెంట్లు, హోటళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక చిన్న చిన్న హోటళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నకిలీ మసాలాలు, నాణ్యత లేని సరుకులు తయారు చేసేవాళ్లు కేటుగాళ్లు బాగా పెరిగి పోయారు. తాజాగా మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

పశువుల కొవ్వుతో గుట్టుచప్పుడు కాకుండా వంట నూనె తయారుచేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణంలో ఈఘటన వెలుగు చూసింది.  గ్రామానికి బయట ఓ గుడిసెలో పశువుల కొవ్వుతో వంట నూనె తయారు చేస్తున్నారు. ఆ నూనెను స్థానికంగా విక్రయించడంతో పాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు తరలించి ప్రజల ప్రాణాలతో కొందరు దుర్మార్గులు.ప్రతి ఆదివారం పట్టణంలోకి వస్తున్న ఎద్దుల కొవ్వును గుడిసెకు తరలిస్తుంటారని సమాచారం. అక్కడే మంటపై పశువుల కొవ్వును కరిగించి.. నూనె తీస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. గుడిసెలో నుంచి దుర్వాసన వస్తుండడంతో గ్రహించిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గుడిసెపై దాడి చేశారు. ఈక్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నూనె తయారీకీ ఉపయోగిస్తున్న వస్తువులను, పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు పంపించారు. ఇంతకాలం పశువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను ఎక్కడెక్కడ విక్రయించారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇలాంటి నూనెలను ఉపయోగించి చేస్తున్నఫుడ్ ను తింటే.. ప్రజలు ప్రాణాలు పోయవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణమైన పనులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.