P Krishna
ఇటీవల కాలంలో ఆస్పత్రులపై రోగి బంధువులు దాడులు చేస్తున్న ఘటనలు తరుచూ జరుగుతున్నాయి.. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది.
ఇటీవల కాలంలో ఆస్పత్రులపై రోగి బంధువులు దాడులు చేస్తున్న ఘటనలు తరుచూ జరుగుతున్నాయి.. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది.
P Krishna
వైద్యో నారాయణ హరి.. వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తుంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారని అంటారు. ఒకప్పుడు వైద్యులు ప్రజలకు నిష్కల్మషమైన సేవలు అందించేవారు. కానీ ఇప్పుడు అంతా కమర్షియల్ అయ్యింది.. ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాపార సంస్థలుగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు కాకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే.. విపరీతంగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్తితి ఏర్పడుతుందని బాధితులు అంటున్నారు. కొన్నిసార్లు వైద్యులు చేసే నిర్లక్ష్యం వల్ల రోగి ప్రాణాలు పోయిన సందర్బాలు ఉన్నాయి. అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముక్కు సమస్యతో ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు ఎల్బీ నగర్ లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆపరేషన్ విఫలం అయ్యింది.. వెంటనే రోగిని వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. వెంటనే రోగిని వేరే ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో చనిపోయినట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు. దీంతో బంధువులు ఆగ్రహానికి గురయ్యారు.. వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగి చనిపోయినట్లు ఆరోపిస్తూ ఎల్బీ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రోగి చనిపోయాడని చెబితే ఇక్కడ ఎవరూ పట్టించుకోవడవ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోగి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. వైద్యులు ఐసీయూ లోకి తరలించి హడావుడి చేశారని, తర్వాత ఎవరినీ కనీసం చూడటానికి కూడా పరిమిషన్ ఇవ్వలేదని.. ఇలా తన కొడుకును పొట్టన పెట్టుకుంటారని అనుకోలేదని కన్నీరు పెట్టుకుంది. ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఎవరు అంటే సమాధానం చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదని.. తాము ప్రాణాలు కాపాడుతారని ఆస్పత్రిలో చేర్చితే.. ప్రాణాలు పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. తమకు న్యాయం జరిగే వరకు ఆస్పత్రి ముందు నుంచి పోయేది లేదని ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.