iDreamPost

ఓర్నీ.. బస్సులో సీటు ఇవ్వలేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు!

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చాక ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అటు ఆర్టీసీ సిబ్బందికి కూడా కష్టతరంగా మారింది. ఓ ప్రయాణికుడు తనకు సీటు ఇవ్వలేదని ఏకంగా కండక్టర్ చెంపపై కొరికిన ఘటన ఆదిలాబాద్ లో వెలుగుచూసింది.

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చాక ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అటు ఆర్టీసీ సిబ్బందికి కూడా కష్టతరంగా మారింది. ఓ ప్రయాణికుడు తనకు సీటు ఇవ్వలేదని ఏకంగా కండక్టర్ చెంపపై కొరికిన ఘటన ఆదిలాబాద్ లో వెలుగుచూసింది.

ఓర్నీ.. బస్సులో సీటు ఇవ్వలేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు!

తెలంగాణా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన విషయం తెలిసిందే. ఇది మొదలుపెట్టిన నుంచి బస్సుల్లో రద్దీ భారీగా పెరిగిపోయింది. మునుపెన్నడు లేని విధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణికులు పెరిగారు. కాగా, ఈ పథకం మొదలుపెట్టి నుంచి ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ బస్సు సదుపాయంతో.. ఆర్టీసీ బస్సులు రద్దీతో పాటు, బస్ స్టాప్ లో ఆగే పరిస్థితి కూడా లేకుండా పోయాయి.

దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటివలే ఈ విషయం పై అటు ఆటో యూనియన్ వాళ్లు, స్కూల్ విధ్యార్థులు సైతం మహిళ ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు. ఫ్రీ బస్సు పేరుతో మమ్మల్నీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెంటనే దానిని నిలిపి వేయాలని కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే.. తాజాగా ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు చేసిన పనికి మిగిలిన ప్రయాణికులంతా నివ్వెరపోయారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణం రోజుకో సమస్యను తెచ్చిపెడుతోంది. బస్సులు రద్దీగా ఉన్నాయంటూ, స్టాప్ ల్లో బస్సులు అగడం లేదంటూ ఇలా రకరకాల గొడవలు వస్తున్నాయి. అలాంటి గొడవే ఏకంగా ఓ బస్ కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సీట్లు లేవని గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా బస్ కండక్టర్ చెంపను కొరికాడు. ఆశ్చర్యకరమైన ఈ ఘటన ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిదంటే.. ఆదిలాబాద్ డిపో ఆర్టీసీ బస్సు, జిల్లా సరిహద్దు అయిన మహారాష్ట్రలోని పాండ్రకవడకు వెళ్లి తిరిగొస్తోంది.

ఈ క్రమంలోనే.. మహారాష్ట్ర పరిధి బోరి బస్టాప్ వద్ద హస్నాపూర్కు చెందిన అజీంఖాన్ అనే వ్యక్తి బస్ ఎక్కి ఆదిలాబాద్ కు ఓ టికెట్ తీసుకున్నాడు. అయితే తాను ఎక్కిన బస్సు రద్దీగా ఉండటంతో సీటు దొరకలేదు. కొద్ది దూరం ప్రయాణించిన అతను కండక్టర్ తో.. ఫ్రీగా వస్తున్న వాళ్లకు సీట్లిచ్చావ్, డబ్బులు పెట్టి ప్రయాణిస్తున్న నన్ను నిల్చోబెట్టావ్.. నాకు సీటు ఇవ్వు అంటూ వాగ్వాదానికి దిగాడు. అలా కాకపోతే నా డబ్బులు నాకు తిరిగిచ్చేయాలాంటూ నానా రచ్చ చేయడంతో కండక్టర్.. అజీంఖాన్ కు డబ్బులు తిరిగిచ్చేశాడు.

ఇక డబ్బులు తిరిగి ఇవ్వడంతో ఆ వ్యక్తి బస్ దిగిపోయాడు. కానీ అంతటితో అజీంఖాన్ రచ్చ అగాలేదు. వెంటనే మరో ప్రైవేట్ వాహనంలో ఆర్టీసీ బస్ ను ఛేజ్ చేసి.. ఆదిలాబాద్ సరిహద్దులోకి రాగానే మళ్లీ బస్ ఎక్కి కండక్టర్ తో గొడవకు దిగాడు. తోటి ప్రయాణికులు అతడిని ఎంత వారిస్తున్న వినకుండా రచ్చరచ్చ చేశాడు. అయితే కండక్టర్ నీ డబ్బులు నీకు తిరిగిచ్చాక మళ్లీ ఎందుకు బస్సు ఎక్కావంటూ నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన అజీంఖాన్ ఆ కండక్టర్ చెంపను గట్టిగా కొరికి పరారయ్యాడు.

ఆదిలాబాద్ చేరుకోగానే ఆ కండక్టర్ జరిగిన ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ప్రయాణికులు మాత్రం ఈ ఉచిత ప్రయాణం పై ఇంకెన్ని గొడవలు, ఘోరాలు జరుగుతాయో అంటూ నిట్టూరుస్తూ బస్ దిగి వెళ్లిపోయారు. మరి, బస్సులో సీటు ఇవ్వలేదని ఆ ప్రయాణికుడు కండక్టర్ చెంప కొరకడంపై మీ అభిప్రాయాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి