iDreamPost
android-app
ios-app

నర్సరీ స్కూల్ ఫీజ్ ఏకంగా రూ.1.20 లక్షలు! ఈ ఘోరం ఎక్కడో కాదు!

ప్రస్తుతం కాలంలో వివిధ విద్యాసంస్థలు పిల్లల స్కూల్ ఫీజులను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఆకాశం వైపు పరుగులు తీస్తున్న స్కూల్ ఫీజుల ధరలను చూసి పేరెంట్స్ కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ప్రస్తుతం కాలంలో వివిధ విద్యాసంస్థలు పిల్లల స్కూల్ ఫీజులను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఆకాశం వైపు పరుగులు తీస్తున్న స్కూల్ ఫీజుల ధరలను చూసి పేరెంట్స్ కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

నర్సరీ స్కూల్ ఫీజ్ ఏకంగా రూ.1.20 లక్షలు! ఈ ఘోరం ఎక్కడో కాదు!

ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని కోరుకుంటారు. అందుకే వారికి మంచి విద్యను అందించాలని ఎంతో తపన పడుతుంటారు. అంతేకాక బాల్యం నుంచి నాణ్యమైన విద్యను అందిస్తే.. వారి భవిష్యత్ బాగుంటుందని ఎక్కువగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే  స్థిరా, చరాస్తులు కూడబెట్టుకోవడం కంటే.. బిడ్డల చదువుల కోసం ఎక్కువగా డబ్బులను ఖర్చు చేస్తుంటారు. రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తూ పిల్లలను ది బెస్ట్ స్కూల్స్ లో జాయిన్ చేయాలని తాపత్రయ పడుతుంటారు. విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతను కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే  హైదరాబాద్ లోని  కొన్ని ప్రైవేటు పాఠశాలల ఫీజుల ధరలు పిల్లల తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఓ స్కూల్ లో నర్సిరీ ఫీజు ఏకంగా రూ.1.20,000 లక్షలు ఉంది. ఈ విషయాన్ని చెబుతూ ఓ పిల్లాడి తండ్రి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం కాలంలో వివిధ విద్యాసంస్థలు పిల్లల స్కూల్ ఫీజులను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఆకాశం వైపు పరుగులు తీస్తున్న స్కూల్ ఫీజుల ధరలను చూసి పేరెంట్స్ కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైదరాబాద్ లోని గండిపేట్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ లోకి జాయిన్ అవుతున్న పిల్లాడి ఫీజు విని తల్లిదండ్రులకు గుండెపోటు వచ్చినంత పనైంది. ఏకంగా 50 శాతం ఫీజులు పెంపును అమలు చేసినట్లు ఆ తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 2023 విద్యా సంవత్సరంలో సదరు విద్యాసంస్థలో  2.3 లక్షలుగా ఉన్న ఫీజులు, 2024 ఏడాదికి 3.7 లక్షలకు పెంచారు. పాఠశాల అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఫీజుల పెరుగుదలను సమర్థించుకున్నట్లు తెలిపారు. ఐబీ కరిక్యులమ్ మారడమే ఇందుకు కారణంగా వారు పేర్కొన్నట్లు పేరెంట్స్ చెప్పారు.

ఓ తండ్రి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదను వ్యక్తం చేశాడు. ప్రైవేట్ స్కూల్స్ భారీగా ఫీజులు పెంచుతున్నాయని వాపోయారు. హైదరాబాద్ లోని గండిపేట్ లోని  ఓ స్కూల్ లో తన పిల్లాడిని చేర్పించాలనుకున్న తండ్రి ఫీజులు చూసి.. ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లాడి నర్సరీ ఫీజు ఏడాదికి రూ.1,20,000 ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. గతేడాది కంటే ఈ సారి 50 శాతం ఎక్కువ పెంచారని ఆ తండ్రి పేర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా మార్చిలో ఫీజు పెంచారని, తక్కువ సమయంలో ఉండడం వల్ల స్కూల్ మార్చడం కష్టమవుతోందని చెప్పారు. ఇదే సమయంలో స్కూల్ ఫీజుల నియంత్రణపై చట్టాలు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.

ఇంకా మరో అబ్బాయి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ బాబుకు ఎన్ రోల్ చేసినప్పుడు ఫీజు విధానం ఒకటవ తరతగతి వరకైనా మారదని అనుకున్నామని, కానీ, నర్సరీ నుంచి ఎల్‌కేజీలోకి అడుగు పెట్టడానికి స్కూల్ యాజమాన్యం ఫీజులో భారీగా పెంపు చేసిందని తెలిపారు. తాము పాఠశాలను మార్చాలని భావించినా.. ఇంత తక్కువ సమయంలో స్కూల్‌లో అడ్మిషన్లు దొరకడం కష్టతరంగా మారిందని ఆ పేరెంట్స్ వాపోయారు. ఈ పోస్టు వైరల్ అయింది.

ఇలా కేవలం  హైదరాబాద్ నగరంలోనే కాకుండా బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై వంటి నగరాల్లో సైతం స్కూళ్ల లక్షల్లో  ఫీజులు ఉంటున్నాయి. మొత్తంగా విద్యార్థుల ఫీజులు.. వారి తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరి.. ఇలా పిల్లల ఫీజులు తల్లిదండ్రులకు గుది బండలుగా మారాయి. మరి.. ఇలా ఆకాశనంటుతున్న స్కూల్ ఫీజుల ధరల విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.