అసెంబ్లీలోకి సామాన్యుడు.. అప్పుడు పేపర్ బాయ్- ఇప్పుడు ఎమ్మెల్యే

ఆయనకు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేయాలని కోరిక బలంగా ఉండేది. కానీ, నిరుపేద కుటుంబం, పైగా ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కాకపోవడం ఇవన్నీ అడ్డంకులుగా మారాయి. అయినా సరే వెనక్కి తగ్గకుండా ధైర్యంతో ఓ అడుగు ముందుకేసి ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిప్రత్యర్థులను ఓడించి ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచి రికార్డును సృష్టించారు. ఇంతకు ఈయన ఎవరంటే?

ఆయనకు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేయాలని కోరిక బలంగా ఉండేది. కానీ, నిరుపేద కుటుంబం, పైగా ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కాకపోవడం ఇవన్నీ అడ్డంకులుగా మారాయి. అయినా సరే వెనక్కి తగ్గకుండా ధైర్యంతో ఓ అడుగు ముందుకేసి ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిప్రత్యర్థులను ఓడించి ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచి రికార్డును సృష్టించారు. ఇంతకు ఈయన ఎవరంటే?

అతడిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆయనను పీజీ వరకు చదివించారు. ఆ తర్వాత ఓ సంఘంలో సలహదారుడికిగా పని చేశారు. ఇకపోతే.. ఆయనకు రాజకీయాల్లో కొనసాగాలనే ఆశ మాత్రం వెంటాడుతూ ఉండేది. కానీ, ఆయనది నిరుపేద కుటుంబం.., పైగా ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో ఇవన్నీ అతనిపై ఆశలపై నీళ్లు చల్లాయి. అయినా సరే మొక్కవోని ధైర్యంతో అతడు రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఏకంగా రాజకీయ ఉద్ధండులను సైతం మట్టి కరిపించి ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డ్ సృష్టించారు. ఈ సామాన్యుడి విజయం గురించి ఇప్పడు రాష్ట్ర ప్రజలంతా చర్చించుకుంటూ ఇది కదా సామాన్యుడి గెలుపు అని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంతకు ఆయన ఎవరు? ఆయన నేపథ్యం ఏంటంటే?

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరు మండలం కల్లూర్‌గూడకు చెందిన నిరుపేద ఆదివాసీ దంపతులు వెడ్మ భీంరావు, గిరిజాబాయిల కుమారుడు వెడ్మబొజ్జు పటేల్‌. వీరిది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు. కాయ కష్టం చేస్తే తప్పా.. పూట గడవని జీవితాలు. ఇక అతి కష్టంగా ఈ దంపతులు తమ కుమారుడు వెడ్మబొజ్జు పటేల్‌ ని పీజీ వరకు చదివించారు. మొదట్లో వెడ్మబొజ్జు పటేల్‌ పేపర్ బాయ్ గా పని చేశారు. ఇక చదువుకునే రోజుల్లోనే వెడ్మబొజ్జు విద్యార్థి నాయకుడిగా కొనసాగారు. ఆ తర్వాత ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ)లో సలహా దారుడిగా కూడా పని చేశారు. అయితే, వెడ్మబొజ్జు పటేల్‌ కు రాజకీయాల్లో రాణించాలనే కోరిక బలంగా ఉండేది. కానీ, అతనిది నిరుపేద కుటుంబం కావడంతో ఆ దిశగా అడుగులు వేయలేకపోయారు.

కొన్నాళ్ల పాటు కాంట్రాక్ట్ ఉద్యోగం చేశాడు. ఇన్నీ చేస్తున్నా.. రాజకీయ నాయకుడిగా పేద ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం చావడం లేదు. ఇలా కాదని భావించిన వెడ్మబొజ్జు పటేల్‌.. ముక్కవోని ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేశాడు. గత రెండేళ్ల కిందట తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి వెడ్మబొజ్జు పటేల్‌ స్థానిక ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేశారు. ఇక నిత్యం ప్రజల్లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. దీంతో ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇతడిని ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. ఆయనది ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కాకపోవడం, పైగా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడంతో అతడు ఎప్పుడూ కూడా నిరాశ చెందలేదు.

మొక్కవోని విశ్వాసంతో సమీప ప్రత్యర్థులతో పోటీ పడి ఖానాపూర్ ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. ఈ స్థానం నుంచి మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, బీఆర్ఎస్ నుంచి ఎన్నారై, కేటీఆర్ స్నేహితుడు భూక్యా జాన్సన్‌లతో వెడ్మబొజ్జు పటేల్‌ పోటీపడ్డారు. అయినా వీరికి బెదరకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్లి అందరినీ కలిసి ఓటు వేయాలని కోరాడు. కట్ చేస్తే.. ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థులను సైతం మట్టి కరిపించి వెడ్మబొజ్జు పటేల్‌ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓ సామాన్యుడు ఎమ్మెల్యేగా గెలవడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎలాంటి డబ్బు, పలుకుపడి లేకుండా సామాన్యులు కూడా రాజకీయాల్లో రాణించవచ్చని అందరికి ఓ సందేశాన్ని పంపకనే పంపాడు. ఇతని విజయం గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. నాడు పేపర్ బాయ్.. ఇప్పుడు ఎమ్మెల్యేగా అంటూ ఆయనను కొనియాడుతున్నారు. మరో విషయం ఏంటంటే? ఇప్పటికీ ఇతడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇంటిలోనే నివసిస్తుండడం విశేషం. పేపర్ బాయ్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన వెడ్మబొజ్జు పటేల్‌ ప్రస్థానంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments