iDreamPost
android-app
ios-app

విషాదం.. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ కన్నుమూత!

  • Author singhj Published - 03:48 PM, Sat - 26 August 23
  • Author singhj Published - 03:48 PM, Sat - 26 August 23
విషాదం.. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ కన్నుమూత!

సమాజంలో గౌరవ మర్యాదలు కలిగిన వృత్తుల్లో అధ్యాపక వృత్తి ఒకటి. పిల్లలను బాగా తీర్చిదిద్ది దేశ భవిష్యత్తును నిర్మించే పనిలో అధ్యాపకుల పాత్ర ఎంతో ముఖ్యం అనే చెప్పాలి. అందుకే ఉపాధ్యాయులకు సమాజంలో మంచి గౌరవం, పేరుప్రతిష్టలు ఉంటాయి. చదువును నేర్పిన గురువులను ఎవరూ అంత సులువుగా మర్చిపోలేరు. తరగతి గదికి అవసరమైన పాఠాలే గాక జీవిత పాఠాలు కూడా బోధించి పిల్లల్ని సరిగ్గా తీర్చిదిద్దే అధ్యాపకులు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిని ఎవరూ అంత సులువుగా మర్చిపోలేరు.

విద్యాభివృద్ధికి కృషి చేసిన అధ్యాపకులు కొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు ఉస్మానియా మాజీ వైస్ ఛాన్స్​లర్ (వీసీ) ప్రొఫెసర్ నవనీత రావు. విద్యారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన నవనీత రావు (95) ఇవాళ కన్నుమూశారు. ఆయన లేరనే వార్తను విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. నవనీత రావు లేని లోటు పూడ్చలేనిదని విద్యార్థులు, అధ్యాపకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా వర్సిటీలో విద్యాభివృద్ధికి ఆయన ఎంతగానో కృసి చేశారని కొనియాడారు. స్టూడెంట్స్​, లెక్చరర్స్​తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

ప్రొఫెసర్ నవనీత రావు 1985 నుంచి 1991 వరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్​గా పనిచేశారు. ప్రొఫెసర్ మరణవార్త తెలుసుకున్న విద్యార్థులు, అధ్యాపకులు.. జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. నవనీత రావు మృతిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనో డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ అని మెచ్చుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గౌరవాన్ని పెంచడమే గాక నిరుపేద విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దారని తెలిపారు. ఆయన వీసీగా ఉన్నప్పుడు ఓయూలో ఎలాంటి రాజకీయ జోక్యాలకు తావివ్వకుండా, స్వయం ప్రతిపత్తిని కొనసాగించారని దాసోజు శ్రవణ్​ గుర్తుచేశారు.