Arjun Suravaram
ఎంతో మంది వివిధ కారణాలతో తమ వారి నుంచి తప్పిపోతుంటారు. అలానే ఓ వృద్దురాలు కూడా తన మనవడి చూసేందుకు ఆస్పత్రికి వచ్చింది. అనంతరం బయటకు వచ్చి.. రోడ్డుపై దారి తప్పిపోయారు. ఈ క్రమంలో తన వారి జాడ కనిపెట్టలేక నాలుగు రోజుల పాటు నరకం అనుభవించారు. చివరకు..
ఎంతో మంది వివిధ కారణాలతో తమ వారి నుంచి తప్పిపోతుంటారు. అలానే ఓ వృద్దురాలు కూడా తన మనవడి చూసేందుకు ఆస్పత్రికి వచ్చింది. అనంతరం బయటకు వచ్చి.. రోడ్డుపై దారి తప్పిపోయారు. ఈ క్రమంలో తన వారి జాడ కనిపెట్టలేక నాలుగు రోజుల పాటు నరకం అనుభవించారు. చివరకు..
Arjun Suravaram
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మిస్సింగ్ కేసులు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. చాలా మంది వివిధ రకాలుగా అదృశ్యమవుతుంటారు. అలా తప్పిపోయిన వారి కోసం వార బంధువులు తీవ్రంగా వెతుకుతుంటారు. అలా తప్పి పోయిన వారిలో కొందరు తమ సొంతూరికి వెళ్లే మార్గం తెలియక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో తినడానికి తిండి దొరక్క, ఉండడానికి గూడు లేక, ఎండకు ఎండి, వానకు తడి చనిపోయిన వారు ఎందరో ఉన్నారు. కొందరికి మాత్రం సాటి మనిషి రూపంలో దేవుడు వచ్చి ఆదుకుంటారు. అలానే మనవడిని చూసేందుకు హైదరాబాద్ వచ్చిన ఓ వృద్దురాలు తప్పిపోయింది. చివరకు ఏమైందంటే..
తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాకు చౌదర్ పల్లి గ్రామానికి చెందిన మణెమ్మ అనే వృద్ధురాలు తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తుంది. ఆమెకు ఓ మనవడు ఉన్నాడు. అతడికి అనారోగ్యంగా ఉండటంతో హైదాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో చేరాడు. ఇక తన మనవడిని చూసేందుకు మణెమ్మ హైదరాబాద్ వచ్చింది. ఈక్రమంలోనే మనవడిని చూసేందుకు వచ్చి. ఈ నెల 22న రోడ్డు మీదకొచ్చి దారి మరచిపోయింది. ఇక తిరిగి తన వాళ్ల దగ్గరకి వెళ్లలేక, వారు ఉండే ప్రదేశం కనుక్కొలేక తీవ్ర ఇబ్బందులు పడింది. అలా నాలుగు రోజులుగా రోడ్ల మీదనే తిరుగుతూ చివరకు మైత్రివనం చేరుకొంది. ఆ నాలుగు రోజులు పాటు తిండి, నిద్రపోవడానికి చాలా ఇబ్బందులు పడింది.
ఇక జన్మలో తన వారిని కలుస్తాని ఆమె అనుకోలేదు. ఎంతో వేదనతో ఎలా పోవాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతు చివరకు మైత్రివనం చేరుకుంది. ఎస్ఎఫ్ఏఎస్ సూపర్ వైజర్ సయ్యద్ అజారుద్దీన్ ఒంటరిగా దీనంగా ఉన్న మణెమ్మను గమనించాడు. ఆమె దగ్గరకు వెళ్లి అసలు విషయం కనుకున్నాడు. అలా ఆపదలో ఉన్న ఆమెను సయ్యదు చేరదీశారు. ఆమెకు తిండిపెట్టి బాగోగులు చూసుకున్నారు. అదే సమయంలో తనకున్న పరిచయాలతో వృద్ధురాలి కొడుకు ఆచూకీ తెలుసుకొని వారి చెంతకు చేర్చారు. మొత్తంగా తప్పిపోయిన ఆ బామ్మ ఎన్నో కష్టాలు పడి.. చివరకు సయ్యాద్ అనే వ్యక్తి సాయంతో తన వారికి వద్దకు చెరింది.
తనను చేరదీసి కాపాడిన అజారుద్దీన్ కి ఆమె, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు ఏమైపోతేమిలే అనుకుంటూ, ఎవరి బిజీలో వారు గడిపే ఇలాంటి నగరాల్లో సాటి మనిషి గుర్తించే సయ్యాద్ లాంటి వ్యక్తులు ఉంటారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలానే తప్పిపోయి ఇబ్బంది పడుతున్న ఆ వృద్దురాలిని కాపాడిన సయ్యాద్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి.. ఆపదలో ఉన్నవారిని కాపాడుతున్న ఇలాంటి వారి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.