iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో NTR 100 అడుగుల విగ్రహం ఏర్పాటు.. ఎక్కడంటే?

  • Published Nov 06, 2024 | 5:24 PM Updated Updated Nov 06, 2024 | 5:24 PM

Hyderabad: NTR సినిమా నటుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు చేసిన సేవలు అంతా ఇంత కాదు. ఇక తాజాగా హైదరాబాద్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారు.

Hyderabad: NTR సినిమా నటుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు చేసిన సేవలు అంతా ఇంత కాదు. ఇక తాజాగా హైదరాబాద్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారు.

హైదరాబాద్ లో NTR 100 అడుగుల విగ్రహం ఏర్పాటు.. ఎక్కడంటే?

భాగ్య నగరం హైదరాబాద్ ప్రస్తుతం మహనేతల విగ్రహాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతుందనే చెప్పాలి. గతంలో కేవలం దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానేతల విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో బాగా రాణించిన రాజకీయ నేతల విగ్రహాలను ఏర్పాటు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే పలువురి మహా నేతల విగ్రహాలు ఏర్పాటు చేయగా..మరికొందరి విగ్రహాలను కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. తాజాగా తెలుగు సినిమా నటుడు, నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. NTR అంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో అభిమానం. ముఖ్య మంత్రిగా ఆయన చేసిన ప్రజా సేవ గురించి ఎప్పటికీ తెలుగు ప్రజలు మరిచిపోలేరు. ఇప్పటికీ తెలంగాణలో కూడా ఎన్టీ రామారావుకు వీరాభిమానులు ఉన్నారు.

ఇక హైదరాబాద్ లో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్న విషయం తెలియగానే తెలుగు చిత్ర పరిశ్రమ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో 100 అడుగుల NTR విగ్రహం ఆవిష్కరిస్తామని టీడీ జనార్దన్ అన్నారు. టీడీపీని స్థాపించిన చోటే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూమి ఇచ్చిన తరువాత విగ్రహావిష్కరణ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. గతంలోనే టీడీపీ స్థాపించిన స్థలంలో ఎన్టీఆర్ వంద అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. తెలుగు ప్రజలందరినీ కలుపుకుపోవాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఉన్నారన్నారు.

ఎన్టీఆర్ చేసిన సేవలకు ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి మంచి గుర్తింపు వచ్చిందని జనార్ధన్ అన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి హైదరాబాద్ లో అన్నగారి విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు. తెలుగు వారికి అన్నగారి విగ్రహాన్ని అంకితం చేస్తామన్నారు. ఆయన శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ చైతన్య యాత్రలు, అసెంబ్లీ ప్రసంగాలు రెండు పుస్తకాలుగా ఇచ్చామని అన్నారు. ఇప్పుడు తారకరామం అనే పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయనున్నామని అన్నారు. ఈ పుస్తకాన్ని ఈ నెల 24న సాయంత్రం విజయవాడలో రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇది నిజంగా నందమూరి అభిమానులకే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇదీ సంగతి. మరి హైదరాబాద్ లో NTR విగ్రహం ఆవిష్కరణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.