10th పాసయ్యారా? రేషన్ డీలర్ ఉద్యోగాలు రెడీ.. మిస్ చేసుకోకండి

Ration shops: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రేషన్ డీలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పదో తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఎన్ని పోస్టులు భర్తీకానున్నాయంటే?

Ration shops: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రేషన్ డీలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పదో తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఎన్ని పోస్టులు భర్తీకానున్నాయంటే?

పేదల ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వం రేషన్ షాపులను తీసుకొచ్చింది. వీటి ద్వారా ప్రజలకు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తుంది. రేషన్ డీలర్ల ద్వారా ఈ సరుకులను ప్రజలకు అందజేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు లబ్థి పొందుతున్నారు. అయితే రేషన్ డీలర్ల కొరత కారణంగా రేషన్ సరుకులు పొందడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో రేషన్ డీలర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న 42 రేషన్ షాపుల్లో డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. నిరుద్యోగులకు ఇది సువర్ణావకాశం.

తెలంగాణలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు, ప్రజల నుంచి డిమాండ్ నెలకొన్న విషయం తెలిసిందే. పలు గ్రామాల్లో రేషన్ డీలర్లు అనారోగ్యం కారణంగా మరణించడం, అక్రమాల కారణంగా డీలర్లను తొలగించడం, లేదా స్వచ్ఛందంగా డీలర్ షిప్ వదులుకోవడం వల్ల ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ షాపులను ఇన్ ఛార్జ్ డీలర్లతో నడిపిస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను కలిసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. దీంతో సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లతో మాట్లాడిన కలెక్టర్ ఖాళీగా ఉన్న రేషన్ షాపుల వివరాలను తెలుసుకొని డీలర్ పోస్టులను భర్తీ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పోస్టుల వివరాలు:

కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో 2 నియోజక వర్గాలు వస్తాయి. ఈ డివిజన్లలో ఖాళీగా ఉన్న 42 షాపుల డీలర్ల భర్తీ కోసం ఆర్డీవోలు నోటిఫికేషన్​ జారీ చేశారు. కామారెడ్డి డివిజన్లో 34, ఎల్లారెడ్డి డివిజన్లో 8 షాపులకు నోటిఫికేషన్​ రిలీజ్ చేశారు. భిక్కనూరు మండలంలో 5, దోమకొండలో 2, కామారెడ్డిలో 8, పాల్వంచలో 2, రాజంపేటలో 5, రామారెడ్డిలో 5, సదాశివనగర్​లో 4, తాడ్వాయిలో 3, ఎల్లారెడ్డిలో 2, లింగంపేటలో 1, నాగిరెడ్డిపేటలో 5 షాపుల్లో డీలర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.

అర్హులు:

డీలర్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోదలిచిన వారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సరియైన అభ్యర్థులు లేని పక్షంలో 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అభ్యర్థులు ఖచ్చితంగా నిరుద్యోగులై ఉండాలి. సర్పంచ్‌, వార్డు సభ్యుడు, కౌన్సిలర్‌, సోసైటీ డైరెక్టర్‌ పదవిలో ఉన్నవారు అనర్హులు. అభ్యర్థుల వయసు 40 ఏళ్లకు మించరాదు. అర్హత, ఆసక్తి కలిగిన వారు జూలై 30 వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్లను ఆర్డీవో కార్యాలయాల్లో సమర్పించాలి. అప్లికేషన్ ఫామ్స్ తహసిల్దార్‌ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Show comments