iDreamPost
android-app
ios-app

NIMS అనస్థీషియా అడిషనల్‌ ప్రొఫెసర్‌ బలవన్మరణం!

  • Published Jul 06, 2024 | 1:03 PM Updated Updated Jul 06, 2024 | 1:03 PM

Hyderabad Crime News : ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పపడుతున్నారు.

Hyderabad Crime News : ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పపడుతున్నారు.

NIMS అనస్థీషియా అడిషనల్‌ ప్రొఫెసర్‌ బలవన్మరణం!

ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై దారుణాలకు తెగబడుతున్నారు. ఎదుటివారిపై దాడులు చేయడం, ఆత్మహత్యలకు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇలాంటి చర్యలకు పాల్పపడుతున్నారు. ఉన్నత చదువులు చదివిన వారు సైతం సమస్యలు తలెత్తితో వాటి పరిష్కారం కోసం ఆలోచించకుండా డిప్రేషన్‌లోకి వెళ్లి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ సమస్య వచ్చినా సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడితే కొంత మేర ఉపశమనం కలుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. నీమ్స్ లో అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ నీమ్స్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచికార్ (46) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది. శుక్రవారం అర్థరాత్రి బేగంపేట బ్రహ్మణవాడలోని ఆమె ఇంట్లో బలవన్మరణానికి పాల్పపడింది. ప్రాచీకార్ అధిక మోతాదులో అనస్తీషియా తీసుకున్నట్లు తెలుస్తుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నీమ్స్ హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. నీమ్స్ హాస్పిటల్ లో అనస్తీసియా ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రాచీకార్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఆమె కుటుంబ సభ్యలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నానరు. డాక్టర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం. వైద్య వృత్తిలో ఉంటూ.. బంగారం లాంటి భవిష్యత్ ఉన్న ప్రాచీకార్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పపడిందో తెలియదని.. ఆమెకు ఎలాంటి సమస్యలు కూడా లేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాచీకార్ చాలా సున్నితమైన వ్యక్తిత్వం ఉన్న వారని.. ఎలాంటి కాంట్రవర్సీలకు తావు ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లే ఉద్యోగి అని సహ ఉద్యోగులు చెబుతున్నారు.  ఆమె మరణంతో సహ వైద్యులు, ఉద్యోగులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.