రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఆ ప్రాంతాల్లో తగ్గనున్న ట్రైన్ జర్నీ!

South Central Railway: ఇండియాలో కీలకమైన వ్యవస్థలో రైల్వే శాఖ ఒకటి. నిత్యం ఎంతో మంది ట్రైన్ల ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఈ క్రమంలోనే తరచూ రైల్వే ప్రయాణికులకు ఆ శాఖ ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతుంది. అలానే తాజాగా ఓ ప్రాంతం వాళ్లకు తీపి కబురు చెప్పింది.

South Central Railway: ఇండియాలో కీలకమైన వ్యవస్థలో రైల్వే శాఖ ఒకటి. నిత్యం ఎంతో మంది ట్రైన్ల ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఈ క్రమంలోనే తరచూ రైల్వే ప్రయాణికులకు ఆ శాఖ ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతుంది. అలానే తాజాగా ఓ ప్రాంతం వాళ్లకు తీపి కబురు చెప్పింది.

రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా నిత్యం వేలాది ట్రైన్లు వెళ్తుంటాయి. ఇక ఈ రైళ్ల ద్వారా రోజూ ఎంతోమంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలను కల్పిస్తుంటుంది. ఈ క్రమంలోనే  తరచూ ఏదో ఒక అంశంలో రైల్వే శాఖ ప్రయాణికులు గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాలకు రైల్వే మార్గం ఉంది. కొన్ని మార్గాల్లో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే రైలు నడుస్తుంటాయి. అంతేకాక ఆయా ప్రాంతాల్లో రైలు తక్కువగా ఉండటం, రైల్వే లైన్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలోనే జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతంలోని ప్రజలకు ఓ తీపి కబురు అందింది. జహీరాబాద్‌ వయా వికారాబాద్‌-పర్లీ వైజ్యనాథ్‌ రైలు మార్గంలో సెకండ్ లైన్ ను మంజూరు చేస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి మెదక్ , రంగా రెడ్డి జిల్లా ప్రాంతాల్లోని రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా ఈ కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణి మధ్య రైల్వే ప్రకటించింది.

ఈ డబ్లింగ్ పనులతో పాటు తాండూరు సిమెంట్‌ క్లస్టర్‌ నుంచి జహీరాబాద్‌ వరకు మరో కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటుకు ఇటీవల సర్వే పనులు  చేశారు. ఈ మార్గంలో రైల్వే ప్రయాణికులతో పాటు  సరకను రవాణ చేసేందుకు తాండురూ సిమెంట్ క్లస్టర్ నుంచి జహీరాబాద్ ప్రాంతాన్ని కలుపుతు నిర్మిస్తున్నారు. ఈ కొత్త రైలు మార్గాన్ని 75 కి.మీ పొడవునా రూ.1,350 కోట్ల నిధులతో నిర్మించనున్నారు. దీంతో తెలంగాణలోని జహీరాబాద్, బంట్వారం, పెద్దేముల్‌ మండలాల మీదుగా సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని కుంచవరం తాలుకా ప్రాంతం వరకు రైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది.  ఈ క్రమంలోనే ఈ కొత్త రైల్వే మార్గంలోని జహీరాబాద్‌, వికారాబాద్‌ ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో కొత్త సేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

ఇక జహీరాబాద్‌ మీదుగా వికారాబాద్‌-పర్లీ వైజ్యనాథ్‌ రైలు మార్గాన్ని రెండో లైన్‌ పూర్తైతే.. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య రైల్వే ప్రయాణం చేసే వారికి మంచి ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 270 కి.మీ. పొడవున ఈ మార్గంలో రెండో లైన్‌ ఏర్పాటు పూర్తైతే ట్రైన్ల సంఖ్య కూడా పెరగనుంది. ఈ మార్గంలో 20 స్టేషన్ల మీదుగా అదనపు దూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్లు పరుగులు తీయనున్నాయి. పాత మార్గం కావడంతో భూసేకరణ పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. అలానే త్వరలో రెండో లైన్‌ నిర్మాణ పనులు పట్టాలెక్కనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తంగా ఈ మార్గాల్లోని రైల్వే పనులు పూర్తై…ఇక్కడి ప్రజల రైల్వే ప్రయాణ సమయం తగ్గుతుంది.

Show comments