iDreamPost
android-app
ios-app

Hyderabad: భార్యాభర్తలిద్దరూ జాబ్‌ చేస్తున్నారా.. మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు జాగ్రత్త!

  • Published Jul 03, 2024 | 1:13 PM Updated Updated Jul 03, 2024 | 1:13 PM

భాగ్యనగరంలో ఉంటూ.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారా.. అయితే మీకో అలర్ట్‌. నగరంలోకి ఓ కొత్త కిడ్నాప్‌ గ్యాంగ్‌ ప్రవేశించింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులైన పిల్లలనే టార్గెట్‌ చేసుకుని కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. ఆ వివరాలు..

భాగ్యనగరంలో ఉంటూ.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారా.. అయితే మీకో అలర్ట్‌. నగరంలోకి ఓ కొత్త కిడ్నాప్‌ గ్యాంగ్‌ ప్రవేశించింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులైన పిల్లలనే టార్గెట్‌ చేసుకుని కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. ఆ వివరాలు..

  • Published Jul 03, 2024 | 1:13 PMUpdated Jul 03, 2024 | 1:13 PM
Hyderabad: భార్యాభర్తలిద్దరూ జాబ్‌ చేస్తున్నారా.. మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు జాగ్రత్త!

నేటి కాలంలో చిన్నదో, పెద్దదో.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయకపోతే గడిచే పరిస్థితులు కావు. ఇద్దరు రెక్కలు ముక‍్కలు చేసుకుని కష్టపడితేనే.. అంతంతమాత్రం. పెరిగిన ఖర్చులు తట్టుకోవాలంటే.. దంపతులు ఇద్దరు పని చేయాల్సిందే. దాంతో పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం చాలా కష్టంగా మారింది. ఒకప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి.. ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లు పిల్లలను చూసుకునేవారు. ఆ ధైర్యంతో.. భార్యాభర్తలు ధైర్యంగా బయటకు వెళ్లి తమ పనులు చూసుకుని వచ్చే వారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మనికి మరో మనిషి బరువయ్యాడు. ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాలు ఏవైనా సరే.. పెద్దవాళ్లు.. కుటుంబంతో కలిసి ఉండే రోజులు కావివి. తప్పనిసరి పరిస్థితుల్లో.. పిల్లలను ఒంటరిగా వదిలి.. ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇదే నేరగాళ్లకు అవకాశంగా మారింది. ఊహించని ప్లాన్‌తో పిల్లలను కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌లు నగరంలోకి ప్రవేశించాయి. ఆ వివరాలు..

హైదరాబాద్‌లోకి నయా గ్యాంగ్‌ ప్రవేశించింది. ఒంటరిగా వెళ్తున్న చిన్న పిల్లలను టార్గెట్‌ చేసి కిడ్నాప్‌ చేస్తోందీ ముఠా. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైన వారి పిల్లలనే టార్గెట్‌ చేసి.. కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్తే.. ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారులను కిడ్నాప్‌ చేయడం ఈజీ కనుక.. అలాంటి వారినే టార్గెట్‌ చేసుకుంటున్నారు ఈ గ్యాంగ్‌. తాజాగా హైదరాబాద్‌ అల్లాపూర్‌ డివిజన్‌ గాయత్రీ నగర్‌లో 12 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాలిక స్కూల్‌ నుంచి ఒంటరిగా వస్తుండటాన్ని గమనించిన అగంతకుడు.. ఆమెని వెంబడించి కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు.

బాలిక స్కూల్‌ బస్‌ నుంచి దిగి.. ఇంటికి వెళ్లే వరకు ఆమెను అనుసరించాడు అగంతకుడు. చివరకు బాలిక నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోకి సైతం చొచ్చుకెళ్లాడు. అది గమనించిన బాలిక.. ఇంట్లోకి పరిగెత్తుకెళ్లి. తలుపులు వేసుకుంది. వెంటనే తల్లిదండ్రులకు కాల్‌ చేసింది. వారు హుటాహుటిన బయలు దేరి వచ్చారు. ఇంటికి వచ్చాక సీసీటీవీ రికార్డ్స్‌ పరిశీలిండంతో.. అగంతకుడు వారి ఇంటి ముందు తచ్చాడిన విజువల్స్‌ రికార్డ్‌ అయి ఉన్నాయి. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేశారు.

ఇక తమ కాలనీలో ఈమధ్య కాలంలో కొందరు గుర్తు తెలియని అగంతకులు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్కూల్‌ పరిసరాల్లో తిరుగుతూ.. పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు ఎరగా వేసి మచ్చిక చేసి కిడ్నాప్‌ చేసేందుకు ట్రై చేస్తున్నారని.. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.. వెంటనే 100కు కాల్‌ చేయాలని సూచించారు పోలీసులు. అంతేకాక తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని.. పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పడమే కాక.. అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.