iDreamPost
android-app
ios-app

Hyderabad: మీరు మండీ తింటున్నారా? ఇది తెలిస్తే లైఫ్ లో మండీ తినరు!

  • Published Mar 26, 2024 | 2:02 PM Updated Updated Mar 26, 2024 | 2:49 PM

హైదరాబాద్ మహా నగరం ఐటీ హబ్ కు ఎంత ఫేమస్ ఓ.. బిర్యానీలకు అంత కంటే ఫేమస్. కానీ, ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే మాత్రం అందరూ భయపడుతున్నారు. తాజాగా నాచారంలో వెలుగు చూసిన ఓ ఘటన అందరిని షాక్ కు గురి చేసింది.

హైదరాబాద్ మహా నగరం ఐటీ హబ్ కు ఎంత ఫేమస్ ఓ.. బిర్యానీలకు అంత కంటే ఫేమస్. కానీ, ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే మాత్రం అందరూ భయపడుతున్నారు. తాజాగా నాచారంలో వెలుగు చూసిన ఓ ఘటన అందరిని షాక్ కు గురి చేసింది.

  • Published Mar 26, 2024 | 2:02 PMUpdated Mar 26, 2024 | 2:49 PM
Hyderabad: మీరు మండీ తింటున్నారా? ఇది తెలిస్తే లైఫ్ లో మండీ తినరు!

బిర్యానీ అనగానే అందరికి గుర్తొచ్చేది హైదరాబాద్ మహా నగరం. రకరకాల బిర్యానీలకు హైదరాబాద్ పెట్టింది పేరు. అలానే పెరుగుతున్న ఆహార పదార్ధాల కల్తీల విషయంలో కూడా ఈ మధ్య భాగ్యనగరం పేరే ఎక్కువగా వినిపిస్తోంది. చిన్న పిల్లలు తినే పీచు మిఠాయిలు, చాక్లేట్లు, పండ్లు, కూరగాయలు ఒకటి రెండు కాకుండా .. తినే ప్రతి పదార్ధం కలుషితం అవుతూనే ఉంది. అయినా కూడా ప్రజలు బయట ఆహార పదార్ధాలను తినడం మానట్లేదు, విక్రయించేవారు కల్తీ చేయడము మానట్లేదు. ముఖ్యంగా భాగ్యనగరపు వాసులకు బిర్యానీపై ఉండే మక్కువ అంత ఇంత కాదు. కానీ, అటు వంటి బిర్యానీలలో ఇప్పటివరకు ఎన్నో కల్తీలు జరిగాయి. దానికి సంబంధించిన ఎన్నో వార్తలను ఇప్పటివరకు వింటూనే ఉన్నాము. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫేమస్ రెస్టారెంట్ లో మరోసారి బిర్యానీ విషయంలో.. అందరికి గుబులు మొదలైంది.

ఒకప్పుడు హైదరాబాద్ లో బిర్యానీ అంటే దైర్యంగా తినే వారు. ఇప్పుడు బయట బిర్యానీ తినాలంటేనే భయపడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఈ మధ్య బిర్యానీలో చచ్చిపోయినా చికెన్ తో పాటు.. బొద్దింకలు , బల్లులు దర్శనం ఇస్తున్నాయి. ఇప్పటివరకు ఇలాంటి వార్తలు ఎన్ని వస్తున్నా .. దీని గురించి ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నా సరే.. విక్రయదారులు భాద్యతా రహితంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. బిర్యానీ తిందాం అని సరదాగా.. నాచారంలోని డాల్ఫిన్ మండీ హోటల్ కు వెళ్లారు నలుగురు యువకులు. కానీ, అక్కడ వారికి ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ నలుగురు యువకులు బిర్యానీ తింటుండగా.. ఇక్కడ బిర్యానీలో ఏకంగా బ్రతికున్న పురుగులే దర్శనం ఇచ్చాయి. దీనితో వారు హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా.. ఆ నలుగురు యువకులను బెదిరించారట.

Are you eating Mandi

దీనితో వారు ఆ హోటల్ పై నాచారం పోలీస్ స్టేషన్ లో, జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా .. ఆ హోటల్ పై కంప్లైంట్ ఇచ్చారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తరచూ సంఘటనలు జరగడంతో .. హైదరాబాద్ వాసులు ఎంతో ఇష్టంగా తినే బిర్యానిపై.. ఓ విధంగా ఆశలు వదులుకుంటున్నారు. ఎందుకంటే, హైదరాబాద్ లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా బిర్యానీ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కానీ, ఇకపై బిర్యానీ అంటే మాత్రం అందరికి ఓ తెలియని భయం ఏర్పడుతోంది. కాబట్టి ఇకపై ప్రజలు బిర్యానీ తినేటపుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి, తాజాగా నాచారం డాల్ఫిన్ మండి రెస్టారెంట్ లో జరిగిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.