కాంగ్రెస్ లో చేరిన మోత్కుపల్లి నరసింహులు!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్ది కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ పార్టీ నేత ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్ది కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ పార్టీ నేత ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాం అని చెబుతున్న కాంగ్రెస్ లోకి ఇటీవల సీనియర్ నేతలు వలస వెళ్తున్న విషయం తెలిసిందే. కొంత కాలంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో అసంతృప్తి నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల జోష్ తెలంగాణలో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష మంచి ఫలితాలను ఇస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. ఈసారి తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం తమ బలాన్ని పెంచుకుంటున్నారు. కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి పలువురు కీలక నేతలు జాయిన్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ఆ మద్య కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. ఇదే జోష్ ఇప్పుడు తెలంగాణలో కొనసాగించాలని అధిష్టానం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇంుదో భాగంగా కాంగ్రెస్ ఆకర్ష్ మొదలు పెట్టింది. ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తి నేతలను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ.. వారికి సముచితమైన స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారను. అంతేకాదు ఇప్పటికే గ్యారెంటీ పథకాలను ప్రవేశ పెట్టిన కాంగ్రెస్.. ప్రచారంలో కూడా దూకుడు పెంచబోతుంది. తాజాగా కాంగ్రెస్ లో పలువురు కీలక నేతలు జాయిన్ అయ్యారు. బీజేపీకి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నరసింహులు. మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఆకుల లలిత తో పాటు శాసన మండలి మాజీ ఉపాధ్యక్షులు నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ సహా కరీంనగర్ కి చెందిన పలువరు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు.

గతంలో తెలంగాణ టీడీపీలో కీలక నేతగా వ్యవహరంచారు మోత్కుపల్లి నరసింహులు. 2009లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ పూర్తిగా బలహీన పడిపోయింది. ముఖ్య నేతలు బీఆర్ఎస్ లోకి వెళ్లిపోవడంతో పార్టీని పట్టించుకోవడం లేదని చంద్రబాబు పై విమర్శలు చేస్తూ.. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల పార్టీలో తనకు సముచితమైన స్థానం ఇవ్వడం లేదని.. మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తనకు తమ్ముడులాంటి వాడని.. అతనితో నాకు ఎలాంటి శత్రుత్వం లేదని, తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మోత్కుపల్లి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడం బీఆరఎస్ కి ఒకంత నష్టమే అంటున్నారు.

Show comments