ఈ తల్లి కష్టం ఎవ్వరికీ రాకూడదు.. 55 ఏళ్ల వయస్సులో ఆటో నడుపుతూ

ఈ తల్లి కష్టం ఎవ్వరికీ రాకూడదు.. 55 ఏళ్ల వయస్సులో ఆటో నడుపుతూ

అమ్మకు మించిన దైవం లేదు అంటుంటారు పెద్దలు. ఇది అనేక సందర్భాల్లో రుజువు అయ్యింది. రుజువూ అవుతూనే ఉంది. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆరాటపడుతుంది తల్లి. వాళ్లకు ప్రయోజకుల్ని చేశాక.. పెళ్లి చేసి మనవళ్లు, మనరాలితో గడపాలని అనుకుంటుంది. కానీ

అమ్మకు మించిన దైవం లేదు అంటుంటారు పెద్దలు. ఇది అనేక సందర్భాల్లో రుజువు అయ్యింది. రుజువూ అవుతూనే ఉంది. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆరాటపడుతుంది తల్లి. వాళ్లకు ప్రయోజకుల్ని చేశాక.. పెళ్లి చేసి మనవళ్లు, మనరాలితో గడపాలని అనుకుంటుంది. కానీ

‘ఎవరు రాయగలరు అమ్మ అనే మాట కన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం’ అని ఓ సినీ కవి తల్లి గురించి ఎంతో అద్భుతంగా వర్ణించారు. అమ్మ లేని ప్రపంచాన్ని ఊహించలేం. విశ్రాంతి ఎరుగని శ్రామికురాలు అమ్మ. బిడ్డల బాగోగులు చూసుకోవడంలోనే సగం జీవితం అయిపోతుంది. తన కన్నా పిల్లల బాగుండాలని కోరుకుంటుంది. బిడ్డలకు చిన్న కష్టమొచ్చినా.. తట్టుకోలేదు తల్లి. వారి కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తుంది. లాలించి, బుజ్జగించి, బతిమాలి, అవసరమైతే దండించి, నయన్నో.. భయాన్నో మంచి మార్గంలో నడిచేలా చేస్తుంది. వారు ఎదుగుతుంటే చూసి మురిసిపోతుంది. పిల్లలకు పెళ్లిళ్లు చేసి.. తాను కృష్ణా రామ అంటూ జీవించాలని అనుకుంటుంది.

కానీ ఈ తల్లికి అలాంటి అవకాశం లేకుండా పోయింది. మనవళ్లు, మనవరాళ్లతో జీవనాన్ని సాగించాల్సిన వయస్సులో రెక్కలు ముక్కలు చేసుకుని.. కష్టపడుతుంది. ఇదంతా ఎవరి కోసమనుకుంటున్నారా.. కొడుకు కోసం. ఆటో నడుపుతూ కొడుకును, అతడి కుటుంబాన్ని పోషిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతడ్ని బతికించుకునేందుకు ఈ వయస్సులో కుటుంబ భారాన్ని తన మీద వేసుకుని కష్టపడుతుంది. ఈమె ఎవరంటే.. కరీం నగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఉమా. ఆమెకు కొడుకు, కూతురు ఉన్నారు. బిడ్డలకు పెళ్లి చేసింది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. భర్త కొంత కాలం క్రితం మరణించడంతో కొడుకుతో జీవనం సాగిస్తుంది. ఇంతలో ఆమె కొడుకుకు కిడ్నీ సంబంధింత సమస్యలు వచ్చాయి. దీంతో పని చేయలేని పరిస్థితి.

కుటుంబాన్ని పోషించేవాడే మూలన పడటంతో.. అతడి మందులకు, ఇంటి అవసరాలకు డబ్బులు కావాల్సి రావడంతో బాధ్యతను తన నెత్తిమీద వేసుకుంది. 55 ఏళ్ల వయస్సులో ఆటో డ్రైవర్ అవతారం ఎత్తింది. భర్త చేసిన పనినే వృత్తిగా మలచుకుని ఆటోను నడుపుతుంది. అయితే ఇటీవల ఎక్కడ చూసినా ఆటోలు ఎక్కువ కావడంతో గిరాకీ తగ్గిపోయింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అటు కొడుకు దుస్థితిని తలచుకుని, ఇటు ఆటో వేస్తున్నా పైసలు రాకపోవడంతో కన్నీటి పర్యంతమైంది ఉమా. బిడ్డ అనారోగ్యం పాలు కావడంతో తప్పని సరి పరిస్థితుల్లో కుటుంబ బాధ్యతను నెత్తిమీద వేసుకుని.. జీవనోపాధి కోసం ఆటో నడుపుతుంది 55 ఏళ్ల తల్లి. రెస్ట్ తీసుకోవాల్సిన వయస్సులో రెక్కలు ముక్కలు చేసుకుంటోంది.

Show comments