P Venkatesh
ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో ఆ తేదీ నుంచి వర్షాలు కురువనున్నట్లు వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో ఆ తేదీ నుంచి వర్షాలు కురువనున్నట్లు వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
P Venkatesh
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపుతుండడంతో జనాలు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లోనుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 45 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. మే నెలలో మరింతగా ఎండలు దంచికొట్టనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వడగాల్పులతో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే మండుటెండల్లో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురును అందించింది. రాష్ట్రంలో ఆ తేదీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
మే నెలలో ఎండలు మరింత ముదురనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వడగాల్పుల తీవ్రత ఎక్కువవుతుండడంతో ఇళ్లకే పరిమితమవ్వాలని సూచిస్తున్నారు. గురువారం నుంచి శనివారం వరకు వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, ఈ నెల 6 నుంచి తెలంగాణలో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం నుంచి కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు రాష్ట్రంలో కురవనున్న వర్షాలతో కాస్త ఉపశమనం లభించనుంది. ఇక రేపు (శుక్రవారం) కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడ వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.