iDreamPost
android-app
ios-app

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. MLC కవితను ఢిల్లీకి తరలిస్తున్న ED

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎంఎల్సీ కవితను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తరలిస్తున్నారు. రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ఫ్లైట్ లో తీసుకెళ్లనున్నారు ఈడీ అధికారులు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కొద్దిసేపటి క్రితం ఎంఎల్సీ కవితను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు విషయాన్ని కవిత కుటుంబ సభ్యులకు తెలియజేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలించడానికి సిద్ధమయ్యారు. ఇదే రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ఢిల్లీకి తరలించనున్నారు. ఈ క్రమంలోనే కవితను కారులో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలిస్తున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే పోలీసులు కవితను తీసుకెళ్లే రూట్ ను క్లియర్ చేశారు. ఈడీ ఇచ్చిన షాక్ తో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీబందోబస్తును ఏర్పాటు చేశాయి.

కవిత అరెస్టుపై ఈడీ ప్రకటన చేసింది. మనీలాండరింగ్ హవాలా చట్టం కింద కవితను అరెస్టు చేసినట్లు ఈడీ వెల్లడించింది. 14 పేజీల అరెస్టు సమాచారాన్ని కవిత భర్త అనిల్ కు అందించినట్లు అధికారులు తెలిపారు. రేపు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం ఈడీ అధికారులు లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం కవితకు మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. కవిత అరెస్టుపై కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.