BRS మహిళా ఎమ్మెల్యే లాస్య నందిత కారుకు ప్రమాదం!

నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది.. ఈ సభకు వెళ్లి వస్తున్న సమయంలో ఎమ్మెల్యే కారుకు ప్రమాదం జరిగింది.

నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది.. ఈ సభకు వెళ్లి వస్తున్న సమయంలో ఎమ్మెల్యే కారుకు ప్రమాదం జరిగింది.

ఇటీవల దేశ వ్యాప్తంగా నిత్యం ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం, అతి వేగం, అనుభవ రాహిత్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.. వారి కుటుంబ సభ్యులు అనాథలుగా మిగులుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే కారుకు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.

సికింద్రాబాద్  కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఆమె ప్రయాణిస్తునన కారును టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో లాస్య నందిత సోదరి కూడా కారులోనే ఉన్నారు. నల్లగొండలో నేడు మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కూతురు ఎమ్మెల్యే లాస్య నందిత. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగి పోటీ చేసి గెలిచింది. ఈ ప్రమాదానికి సంబందించిన వివరాలు లాస్య నందిత సోషల్ మీడియాతో పంచుకున్నారు. నల్లగొండ బీఆర్ఎస్ సభ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యానని.. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని, చింతించాల్సిన పని లేదన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Show comments