iDreamPost
android-app
ios-app

దొంగను కట్టేసి కొట్టారు.. ఆకలి అంటే పులిహూర తినిపించారు! ఎక్కడంటే?

  • Published Sep 17, 2024 | 12:45 PM Updated Updated Sep 17, 2024 | 1:19 PM

Nalgonda District: ఈ మధ్య కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఉదయం రెక్కీ నిర్వహిస్తూ తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పపడుతున్నారు.

Nalgonda District: ఈ మధ్య కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఉదయం రెక్కీ నిర్వహిస్తూ తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పపడుతున్నారు.

దొంగను కట్టేసి కొట్టారు.. ఆకలి అంటే పులిహూర తినిపించారు! ఎక్కడంటే?

నేటి సమాజాంలో మానవత్వం అనేదే లేకుండా పోతుందని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి.. చేస్తున్నాయి.  చిట్టీల పేరుతో డబ్బు వసూళ్లు చేయడం, దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్, సైబర్ మోసాలు ఇలా మనిషిని మనిషి దోచుకుంటున్నారు. కొంతమంది కేటుగాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితాన్ని గడపాలని చూస్తున్నారు. అందుకోసం దొంగతనాలు వృత్తిగా కొనసాగిస్తున్నారు. మనుషుల్లో ఇప్పటికీ మానవత్వం ఉందని చాటి చెప్పిన ఓ సంఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన దొంగను పట్టుకొని దేహశుద్ది చేసిన యువకులు అతని పరిస్థితికి జాలి పడి ఆకలి తీర్చడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడం గ్రామంలో ఇటీవల ఇళ్లల్లోకి చొరబడి చోరీలకు పాల్పపడుతున్న పోగల గణేశ్ అనే దొంగను స్థానికులు పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని గణేశ్ దొంగతనాలకు పాల్పపడుతున్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతన్ని రెండ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. అనుకున్నట్లుగానే వారి వలలో చిక్కాడు గణేష్. ఇంకేముంది పట్టుకున్న వెంటనే యువకులు అతనికి దేహశుద్ది చేశారు. అక్కడే ఓ కరెంట్ స్థంబానికి కట్టేశారు.  కొద్దిసేపటి తర్వాత గణేశ్ తనకు ఆకలి వేస్తుందని దీనంగా అడగడంతో యువకులు మనసు కరిగిపోయింది. ఎంత దొంగ అయినా.. ఆకలితో ఉన్న అతని కడుపు నింపడం ధర్మం అని అనుకున్నారు.

ఈ క్రమంలోనే అక్కడ వినాయకుడి సమర్పించిన ఫలహారాల్లో పులిహూర తీసుకు వచ్చి ఓ యువకుడు స్వయంగా గణేశ్ కి తినిపించాడు. పులిహూర తిన్న తర్వాత అతడికి మంచినీరు తాపించారు. కొంతమంది యువకులు ఆ దొంగని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఆలయంలోని హుండీల్లో డబ్బులు దొంగలించేవాడిని తెలిపాడు. బంగారు, వెండివ వస్తువులు చోరీ చేయలేదని అన్నాడు.  అనంతరం యువకులు పోలీసులకు అప్పగించారు.   సాధారణంగా దొంగతనానికి వచ్చిన వారికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగిస్తుంటారు. కానీ.. మానవత్వం చాటుకున్న ఈ గొప్ప సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.