ఆ పంట పండించే రైతులకు గుడ్ న్యూస్! ఇకపై బోనస్ కూడా!

Tummala Nageswara Rao: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వరికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆదివారం విల్లేకర్లతో మాట్లాడుతూ.. వరి పంటకు సంబంధించి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.

Tummala Nageswara Rao: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వరికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆదివారం విల్లేకర్లతో మాట్లాడుతూ.. వరి పంటకు సంబంధించి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. ముఖ్యంగా వారికి పెట్టుబడులకు సంబంధించి, పండించిన పంట విషయంలో ప్రభుత్వాలు పలు ప్రకటనలు చేస్తుంటాయి. తాజాగా తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, రైతులపై ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వరి రైతులకు శుభవార్త చెప్పారు. జూన్ లో నిర్వహించే ‘గ్లోబల్ రైస్ సమ్మిట్’ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా వరి పంట విషయంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

జూన్  నెలలో గ్లోబల్ రైస్ సమ్మిట్ ను నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించిన బ్రోచర్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మంత్రి తుమ్మల మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..వచ్చే వానాకాలం సీజన్ లో పండించే వరికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తుందని మంత్రి వెల్లడించారు. అలానే రాష్ట్రంలో రైతులు వరి పంటను తక్కువ వేయాలని, అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేసి, పంటల సాగులో సమతుల్యత పాటించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్‌ సిఫార్సుల ప్రకారం.. వరితోపాటు అన్ని పంటలకు కూడా మద్దతుధర ఇవ్వాలని మంత్రి  తెలిపారు. అదేవిధంగా వివిధ దేశాలకు వరి ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు రాష్ట్రానికి ప్రతిబంధకంగా ఉన్నాయని, రైస్‌ పాలసీల విషయంలో కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు. కేరళలో దొడ్డు బియ్యం, కర్నాటక లో సన్న బియ్యం వాడుతున్నారని, అలానే మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో జోనం, చిట్టి ముత్యాలు వంటి రకాల బియ్యం వాడుతారని, ఆ ప్రకారం ఆయా రాష్ట్రాలకు తెలంగాణ నుంచి బియ్యం అమ్ముకునేలా అవకాశం కల్పించాలని మంత్రి కేంద్రాన్ని కోరారు. ఎంత అవసరమైతే అంతమేరకు వరి సాగు చేయాలని, ఎగుమతులు పెంచడం వల్ల రాష్ట్రంలో అదనపు వరిని విక్రయించడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. ఇప్పటికే పేదలకు ఇస్తున్న రేషన్‌రైస్‌ ఎవరూ వాడుకోవడం లేదని తుమ్మల అభిప్రాయపడ్డారు.

ఇక రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయానికే ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. వచ్చే వర్షకాలం సీజన్ నుంచి క్వింటా వరికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని మంత్రి ప్రకటించారు. పంటల బీమా స్కీమ్ పైనా కసరత్తు చేస్తున్నామని తుమ్మల స్పష్టం చేశారు. ఇక సమ్మిట్ నిర్వాహకులు డాక్టర్ జానయ్య వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కమిషనర్‌ గోపి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి పాల్గొన్నారు. మరి.. వరి రైతుల విషయంలో మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments