iDreamPost
android-app
ios-app

Free Bus Ride: ఎల్లుండి నుండి బస్సుల్లో ఫ్రీ జర్నీ. ఆ ఒక్కటి చూపిస్తేనే!

Free Bus Ride For Women From December 9th Onwards in Telangana: మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి డేట్ ఫిక్స్ చేసింది. మంత్రి శ్రీధర్ బాబు డిసెంబర్ 09 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రకటించారు.

Free Bus Ride For Women From December 9th Onwards in Telangana: మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి డేట్ ఫిక్స్ చేసింది. మంత్రి శ్రీధర్ బాబు డిసెంబర్ 09 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రకటించారు.

Free Bus Ride: ఎల్లుండి నుండి బస్సుల్లో ఫ్రీ జర్నీ. ఆ ఒక్కటి చూపిస్తేనే!

తెలంగాణలో నేడు కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు శుభవార్తను అందించింది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్సిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని పురస్కరించుకుని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ తెలిపారు. తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ముందుగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చామని మంత్రి శ్రీదర్ బాబు వెల్లడించారు.

ఎల్లుండి నుంచి అనగా డిసెంబర్ 09 2023 తేదీ నుంచి మహిళా సోదరీమణులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అయితే ఆధార్‌ కార్డ్‌ చూపించి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని స్పష్టం చేశారు మంత్రి. తెలంగాణ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చని స్పష్టం చేశారు. ఇక మంత్రి చేసిన ప్రకటనతో మహిళా లోకం ఆనందం వ్యక్తం చేస్తోంది. హామీలు ప్రకటించి అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. కాగా హస్తం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు మూడు రకాల పథకాలు కేటాయించారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయంతో పాటు 500 రూపాలయకు గ్యాస్ సిలిండర్.. అలానే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బర్త్ డేని పురస్కరించుకుని డిసెంబర్ 09 నుంచి రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ తొలి భేటీ జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీధర్ బాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ. 10 లక్షలకు పెంపు హామీలను సోనియా బర్త్ డే కానుకగా అమలు చేస్తామని తెలిపారు. ఈ రెండు గ్యారంటీలపై సంబంధిత అధికారులతో శుక్రవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మరి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.