iDreamPost
android-app
ios-app

సీతక్క స్పీచ్ కి దద్దరిల్లిన అసెంబ్లీ.. ఊర మాస్ స్పీచ్!

Seethakka Mass Speech: శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈక్రమంలోనే మంత్రి సీతక్క ఇచ్చిన స్పీచ్ కి అసెంబ్లీ దద్దరిల్లింది.

Seethakka Mass Speech: శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈక్రమంలోనే మంత్రి సీతక్క ఇచ్చిన స్పీచ్ కి అసెంబ్లీ దద్దరిల్లింది.

సీతక్క స్పీచ్ కి దద్దరిల్లిన అసెంబ్లీ.. ఊర మాస్ స్పీచ్!

శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్ని పలు అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగింది. ఐటీ అంశంపై  జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుపై తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల, ఆటో డ్రైవర్ల సమస్యలు, ఇతర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇదే సమయంలో పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క ఇచ్చిన స్పీచ్ కి అసెంబ్లీ దద్దరిల్లింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం సీతక్క వైపు ఆశ్చర్యంగా చూశారు.

ములుగు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీతక్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. అనేక కష్టాలు,  సమస్యలు ఎదుర్కొన్నారు. అలానే ప్రజా సమస్యలపై  పోరాటం చేయడంలో ఆమె ఎప్పుడు ముందుటారు. కరోనా సమయంలో అడవుల్లో ఉండే గిరిజన ప్రజల కోసం, మాముల ప్రాంతాల్లో ఉండే వారి కోసం సీతక్కే స్వయంగా వెళ్లి ఆహారం పదార్ధాలను అందించారు. అంతేకాక సామాన్య ప్రజలతో అతి సామాన్యురాలిగా కలిసిపోతారు. పార్టీలతో సంబంధం లేకుండా సమస్య అంటూ తన వద్దకు వచ్చిన వారిని సీతక్క ఆదరిస్తారు. అలానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై సీతక్క గళం విప్పారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ తరపున ములుగు నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలానే రేవంత్ రెడ్డి కేబినెట్ లో గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇక ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమె తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. ప్రజాసమస్యలపై ప్రతిపక్ష పార్టీలు సంధించిన ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు ఇచ్చారు. మహిళలు ఉచిత ప్రయాణం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావాలా? వద్దా? అనేది సూటిగా చెప్పాలని బీఆర్ఎస్  నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు మొదలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆర్టీసీ ఆస్తులను అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వంది అంటూ సీతక్క మండిపడ్డారు.

పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులు ధ్వంసం చేసి, కుదేళ్లు చేసి, కబ్జాలు చేసి, ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యకు కారణమైన వీళ్లు, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడుతున్నారంటూ  ఫైర్ అయ్యారు. పేద వాళ్ల ఎక్కే బస్సు రేట్ల పెంచి.. ఇవ్వాలా ఆడవాళ్లు  బస్సులో  ఉచితంగా వస్తే తట్టుకోలేక పోతున్నారు. రైతు బంధు పేరుతో ఎంతో మంది ధనవంతులకు లక్షల రూపాయలు కట్టబెడితే పేదవారు ఎవరైనా మీ ఇంటికి ముందుకు వచ్చి ధర్నాలు చేశారా?, ఈ రోజు ఆటోల అంశం ముందుకు పెట్టుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని అమె అన్నారు. ఈ బీఆర్ఎస్ ఎప్పుడు సెంటిమెంట్ ని వాడుకుని ఒకర్ని ముందు పెట్టి, వెనుక నుంచి మీరు వస్తారు, ఇది మీ నైజం అంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు.

మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా నెలకు ఐదారు వేలు మిగులుతున్నాయి అంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు తట్టుకోలేక పోతున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ఇక మంత్రి సీతక్క ఇచ్చిన స్పీచ్ కి కాసేపు అసెంబ్లీ దద్దరిల్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీతక్క ప్రసంగానికి అవాక్కయ్యారు. మరి.. అసెంబ్లీలో సీతక్క ఇచ్చిన మాస్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. మంత్రి సీతక్క ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.