Uppula Naresh
తెలంగాణలో ఎన్నికల బిజీలో ఉన్న మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్ లోని నీలోఫర్ కేఫ్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వ్యక్తులతో టీ తాగుతూ కొద్దిసేపు ముచ్చటించారు.
తెలంగాణలో ఎన్నికల బిజీలో ఉన్న మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్ లోని నీలోఫర్ కేఫ్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వ్యక్తులతో టీ తాగుతూ కొద్దిసేపు ముచ్చటించారు.
Uppula Naresh
హైదరాబాద్ లో ఉన్న నీలోఫర్ కేఫ్ ఎంత ఫేమస్ అనేది మన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ తయారు చేసే టీ ఎంతో స్పెసల్ అని చెప్పాలి. ఇక్కడికి రోజుకు ఎంతో మంది వచ్చి టీ తాగి వెళ్తుంటారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నీలోఫర్ కేఫ్ లో సందడి చేశారు. అయితే ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్న ఆయన తాజాగా నీలోఫర్ కేఫ్ లో సందడి చేశారు. ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంగా మంత్రి కేటీఆర్ నీలోఫర్ కేఫ్ వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఆయన అక్కడికి వచ్చిన వ్యక్తులతో పాటు కూర్చుని వారితో కొద్దిసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ వారితో కలిసి టీ తాగుతూ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి పై వారికి వివరించారు. నగరంలో ఉన్న శాంతి భద్రతలతో పాటు అభివృద్ధి కూడా అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ బెంగళూరులో పని చేస్తున్న యువకుని కుటుంబంతో సభ్యులతో మాట్లాడారు.బెంగళూరు నుంచి వచ్చిన ప్రతిసారి మేము హైదరాబాద్ అంతా వినూత్నంగా కనిపిస్తుందని, ముఖ్యంగా గడిచిన పదేళ్లలో హైదరాబాద్ అద్భుతంగా మార్పు చెందిందని ఆయన అన్నారు. దశాబ్దాల కిందట వారణాసి నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడిన మాకు హైదరాబాద్ గత 10 ఏళ్లలో మారిన తీరు పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇంతే కాకుండా హైదరాబాద్ నగరంలో కులాలు, మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి జీవించే వాతావరణం ఉండడం అదృష్టం అని వారు కోనియాడారు.
అనంతరం మంత్రి కేటీఆర్ అక్కడే ఉన్న మహిళలతో కూడా మాట్లాడారు. ఓ మహిళ మంత్రితో మాట్లాడుతూ.. నా కుమారుడికి మీరంటే ఎంతో ఇష్టమని అన్నారు. వీరితోనే కాకుండా అక్కడున్న కొందరు మైనారిటీల కుటుంబ సభ్యులతో కూడా కేటీఆర్ మాట్లాడి వారి నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. హదరాబాద్ మహా నగరంలో ఇప్పటి వరకు ఎలాంటి మత ఘర్షణలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలిస్తుందని, ఇంతే కాకుండా మైనారిటీలకు సర్కార్ అన్ని అవకాశాలు కల్పిస్తుందని వారి కేటీఆర్ తో తెలిపారు. ఇక మంత్రి కేటీఆర్ రాకను గమనించిన కొందరు వ్యక్తులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.