iDreamPost
android-app
ios-app

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి.. రైతు భరోసా 15 వేలు.. ఎప్పటినుంచంటే?

తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్తను అందించారు. రైతు భరోసా కింద ఇచ్చే 15 వేల సాయాన్ని అప్పటి నుంచే ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్తను అందించారు. రైతు భరోసా కింద ఇచ్చే 15 వేల సాయాన్ని అప్పటి నుంచే ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి.. రైతు భరోసా 15 వేలు.. ఎప్పటినుంచంటే?

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ అన్ని వర్గాల సంక్షేమం దిశగా ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభం కాగా మిగతా వాటిని కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు గుడ్ న్యూస్ అందించారు. రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కింద అందించే పంట పెట్టుబడి సాయం రూ. 15 వేలు త్వరలోనే ఇస్తామని తెలిపారు. అదే విధంగా రైతు రుణమాఫిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా కింద ఇచ్చే రూ. 15 వేల సాయాన్ని రైతులకు అందించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. మంత్రి ప్రకటనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలుచేసి రైతులను ఆదుకుంటామని వెల్లడించారు. అంతేకాదు ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని ప్రకటించారు. ఇక రైతు రుణమాఫిపై మాట్లాడిన మంత్రి తుమ్మల ఆగస్టులోపు రైతుల రుణాలను మాఫి చేస్తామని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి కోసం రైతు బందు పేరిట ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులకు ఎకరానికి 5 వేల చొప్పున రైతుల ఖాతాల్లోనే నేరుగా జమ చేశారు. ఇక ఇదే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చి రైతులకు నిధులు విడుదల చేస్తోంది. అయితే రైతు భరోసా 15 వేలు ఇస్తామని ప్రకటించినప్పటికీ.. ఆ హామీ నెరవేరలేదు. ఇటీవల యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా పెండింగ్ నిధులను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇది వరకే యాసంగికి సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదలైనప్పటికీ రైతులందరికీ అందలేదు. తాజాగా నిధుల విడుదలో 5 ఎకరాలపైబడిన రైతుల ఖాతాల్లో నిధులు జమవుతున్నాయి.