Telangana: పోలీసులతో యువకుడి యుద్ధం.. సినిమా లెవెల్లో మెట్ పల్లి లవ్ స్టోరీ!

Telangana: మెట్ పల్లి లవ్ స్టోరీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సినిమాని తలపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Telangana: మెట్ పల్లి లవ్ స్టోరీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సినిమాని తలపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

‘కమిషనర్ కూతురైతే ప్రేమించకూడదా.. కమిషనర్ కూతుళ్లకు మొగుళ్లు రారా..’ అనే డైలాగ్ విన్నారా? రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఇడియట్‌ సినిమాలో రవితేజ చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో ఓ రేంజ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా యూత్ మీద గట్టిగా ప్రభావం చూపించింది. ఈ బ్లాక్ బస్టర్ స్టోరీ ఇప్పుడు జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో రిపీట్ అవుతుంది. అయితే.. ఇడియట్ లో రవి తేజ పోలీస్ కమిషనర్ కూతుర్ని ప్రేమిస్తే.. ఈ మెట్‌పల్లి హీరో మాత్రం ఓ డిస్మిస్డ్ హోంగార్డ్ కూతుర్ని ప్రేమించాడు. చాలా సినిమాల్లోలాగే ఈ లవ్ స్టోరీలో కూడా ట్విస్ట్ లు, స్టంట్ లు జరుగుతున్నాయి. ఈ లవ్ బర్డ్స్ తమ పెద్దలను ఎదురించి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ మేజర్లు కావటంతో వీరి మ్యారేజ్ హాపీ మ్యారిడ్ లైఫ్ అవుతుందని నమ్మారు. కన్నవాళ్ళు ఒప్పుకోకపోయినా పోలీసులు తమకి సపోర్ట్ చేస్తారని నమ్మారు. కానీ.. ఇప్పుడు ఆ పోలీసులే ఈ ఇడియట్ స్టోరీకి పోకిరి సినిమా రేంజ్ లో ట్విస్ట్ లు ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మెట్‌పల్లికి చెందిన మారుతి.. అదే టౌన్ కి చెందిన ఓ డిస్మిస్డ్ హోంగార్డు కూతురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేసేందుకు ఆమె తల్లి దండ్రులు ప్రయత్నించారు. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ నెలాఖరున పెద్దలను ఎదిరించి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసి అమ్మాయి తండ్రి తన పోలీస్ పవర్ చూపించారు. తన పరిచయాలతో ఆ జంటకు చుక్కలు చూపిస్తున్నారు. అందుకు.. సీఐ, మిగతా పోలీసులు కూడా సహకరించారు. అదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. కొత్తజంటని అమ్మాయి తండ్రి చంపేస్తానంటూ బెదిరించారు. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ అక్టోబర్ ఒకటో తారీఖున వారు మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో వారికి న్యాయం చేసి రక్షణ కల్పించాల్సిన సీఐ నిరంజన్ రెడ్డి షాక్ ఇచ్చాడు. ఆయన వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగాలేదు.

కౌన్సెలింగ్ పేరుతో ఆ అమ్మాయిని అక్టోబర్ 1న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. లోపల బంధించారు. తన భర్తని కలవనీయకుండా చేశారు. అయితే.. తన భార్య లేకుండా తాను ఎక్కడికీ వెళ్లేది లేదంటూ దిష్ట వేసి కూర్చున్నాడు మారుతి. తనను భర్తతో పంపాలని అమ్మాయి ఏడుస్తున్నా కానీ పోలీసులు కనికరించలేదు. బలవంతంగా అదే రాత్రి జగిత్యాలలోని సఖి సెంటర్‌కు తీసుకెళ్లారు. మరోవైపు.. మారుతికి తమ తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలిచారు. పోలీసుల ఆదేశాలు లెక్క చేయలేదు. మారుతీతో పాటు వారు కూడా అర్ధరాత్రి స్టేషన్‌లోనే నిరసన చేశారు. అక్టోబర్ 2న డీఎస్పీ రంగంలోకి దిగి అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రుల అభిప్రాయాలని తెలుసుకున్నారు. అయితే అమ్మాయి తండ్రి అస్సలు తగ్గలేదు. సూసైడ్ చేసుకుంటానని బెదిరించారు. ఆయన ఆవేశం తగ్గే దాకా కొన్నీ రోజులు సమయం ఇవ్వాలని, అప్పటివరకు ఇద్దరినీ వేరువేరుగా ఉంచాలని, కొంచెం ఆయన సద్దుమణిగాక అమ్మాయిని పంపిస్తామంటూ పోలీసులు చెప్పుకొచ్చారని.. మారుతి తల్లిదండ్రులు చెబుతున్నారు.

అమ్మాయి తండ్రి కొన్నేళ్ల కిందట హోమ్ గార్డ్ గా బెదిరింపులు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వసూళ్లు చేశారట. వాటితో అడ్డంగా దొరికి డిస్మిస్ అయ్యాడట. తనను, తన భర్త కుటుంబాన్ని తన తండ్రి చంపేస్తాంటూ బెదిరిస్తున్నాడని అమ్మాయి వాపోతుంది. తన పేరెంట్స్‌తో ఉండలేనని, తన భర్త దగ్గరకు పంపమని ఆ అమ్మాయి వేడుకుంటుంది. కానీ పోలీసులు మాత్రం కౌన్సిలింగ్ పేరుతో ఇప్పటికీ ఆమెను సఖీ సెంటర్‌లోనే ఉంచారు. అంతేకాకుండా.. సఖీ సెంటర్‌లోకి అమ్మాయి తండ్రిని మాత్రమే అనుమతిస్తున్నారు. భర్తను, అత్తామామలను అనుమతించడం లేదు. ఇలా పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. వాళ్ళు మేజర్స్. అయినా కానీ వారి ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్, మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తలని వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని మారుతి కుటుంబం వేడుకుంటోంది. మరి ఈ లవ్ స్టోరీ ఎప్పుడు సుఖాంతం అవుతుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments