iDreamPost
android-app
ios-app

తీరం దాటిన వాయుగుండం.. తెలంగాణలో 5 రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో వర్షాలు దంచికొట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తీరం దాటింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వానలు కురువనున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలంగాణలో వర్షాలు దంచికొట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తీరం దాటింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వానలు కురువనున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

తీరం దాటిన వాయుగుండం.. తెలంగాణలో 5 రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో ఏపీ చిగురుటాకులా వణికిపోతోంది. ఎడతెరిపి లేని వానలతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భయంకరమైన వానల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తీరం దాటింది. చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటినట్లు వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో 5 రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వనపర్తి, గద్వాల , మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో మేఘావృతమై అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.

దట్టమైన మేఘాలు ఆవరించి పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఇక వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల కారణంగా ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు,కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. వర్షాలు వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.