P Venkatesh
మహిళా కానిస్టేబుల్ కారు డ్రైవర్ తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. వీరికి 19 నెలల కుమారుడున్నారు. సజావుగా సాగుతున్న వీరి వైవాహిక జీవితంలో అతడి వక్రబుద్ది బయటపడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
మహిళా కానిస్టేబుల్ కారు డ్రైవర్ తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. వీరికి 19 నెలల కుమారుడున్నారు. సజావుగా సాగుతున్న వీరి వైవాహిక జీవితంలో అతడి వక్రబుద్ది బయటపడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
P Venkatesh
మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం అరికట్టలేకపోతున్నారు. నిత్యం దేశంలో ఏదోఒకచోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఆకతాయిలు, దుండగులు అమాయకపు మహిళల ప్రాణాలను బలిగొంటున్నారు. ప్రస్తుతం సమాజంలో పట్టిపీడిస్తున్న భూతం వరకట్నం. వరకట్న వేధింపులు సాధారణ మహిళలకే కాదు మహిళా పోలీసులకు కూడా తప్పడం లేదు. తాజాగా ఓ మహిళా కానిస్టేబుల్ వరకట్న దాహానికి బలైపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుని చివరికి అతడి వేధింపులకు అసువులు బాసింది. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.
భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మీగడ స్వాతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రస్తుతం ఖమ్మం 4వ డివిజన్ బాలాజీనగర్‌లో భర్త కుమారుడితో నివాసముంటున్నారు. మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో స్థానికంగా తీవ్ర కలకలంరేగింది. ఖమ్మం అర్బన్ ఎస్‌ఐ పి.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా కానిస్టేబుల్ స్వాతి రెండేళ్ల కిందట ఖమ్మంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో రాజీవ్‌నగర్‌గుట్టకు చెందిన కారుడ్రైవర్ ప్రవీణ్‌ను ప్రేమించింది అని తెలిపారు. కొంతకాలం తర్వాత వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారని వెల్లడించారు.
అయితే కొంత కాలం పాటు మహిళా కానిస్టేబుల్ మీగడ స్వాతి వైవాహిక జీవితం ఏవిధమైన ఇబ్బందులు లేకుండా బాగానే సాగింది. వీరికి 19 నెలల కుమారుడు ఉన్నాడు. ఇక అప్పుడే స్వాతి భర్త వక్ర బుద్ది బయటపడింది. వరకట్నం తీసుకురావాలని ప్రవీణ్ స్వాతిని వేధించడం మొదలుపెట్టాడు. ఇక చేసేదేం లేక స్వాతి అప్పు చేసి రూ.9 లక్షలు, తండ్రి నుంచి మరో రూ.14 లక్షలకు పైగా ఇప్పించింది. అంతటితో సంతృప్తి చెందని ప్రవీణ్ మద్యం సేవిస్తూ బాధ్యతారాహిత్యంగా ఉంటూ నిత్యం స్వాతిని వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో స్వాతి, ప్రవీణ్ గొడవపడినట్లు స్థానికులు తెలిపారు.
ఈ గొడవల విషయం తెలుసుకున్న స్వాతి సోదరి కవిత వారి ఇంటికి చేరుకుంది. తాను వచ్చేసరికి స్వాతి కిందపడుకుని, ఉందని, ఏమైందని ఆరా తీస్తే ఉరి వేసుకుందని ప్రవీణ్ చెప్పాడని కవిత వెల్లడించింది. వెంటనే స్వాతిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు. ఇక స్వాతి మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన కవిత ప్రవీణ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మరి కారు డ్రైవర్ తో ప్రేమలో పడి వరకట్న వేధింపులకు బలైపోయిన మహిళా కానిస్టేబుల్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.