VIDEO: రోడ్డు ఊడుస్తున్న GHMC కార్మికురాలిని ఢీ కొన్న బస్సు! సీసీటీవీ దృశ్యాలు

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితులు హైదరాబాద్‌ మహా నగరంలో నెలకొంటున్నాయి. ఉక్కిరిబిక్కిరి చేసే ట్రాఫిక్‌, నిర్లక్ష్యంగా దూసుకొచ్చే వాహనాలతో నగరవాసి జీవితం నిత్య నరగంగా మారిపోయింది. రోడ్డు పక్కన నిల్చున్నా.. నడిచివెళ్తున్నా.. ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో అనే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తుంది. ఏ తప్పు లేకున్నా.. ఎదుటి వ్యక్తి నిర్లక్ష్యమంతో ప్రాణాలు పొగొట్టున్న అమాయకులు చాలా మంది ఉన్నారు. తాజాగా సమాజ సేవలో భాగంగా తన పని తాను చేసుకుంటున్న ఓ పారిశుద్ధ్య కార్మికురాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పుయింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికులరాలిగా పనిచేస్తున్న సునీత(35).. రోజూలాగే తెల్లవారుజామునే నిద్రలేచి రామ్‌ కోఠిలో రోడ్డు తనకు కేటాయించిన విధుల్లో నిమగ్నమైంది. ఉదయం 7 గంటల సమయంలో రోడ్డు పక్కన ఉన్న చెత్తనంతా ఊడుస్తున్న క్రమంలో కాలేజీ బస్సు రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. స్థానిక అయాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్స్ కళాశాలకు చెందిన బస్సు వేగంగా వచ్చి, అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. అక్కడే రోడ్డు ఊడుస్తున్న సునీతను సైతం బస్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుతీత అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నారాయణ గూడ పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, బస్సును సీజ్‌ చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి: హైదరాబాద్: ప్రైవేట్ పార్ట్స్ లో బంగారం! అసలు విషయం ఏంటంటే?

Show comments