iDreamPost
android-app
ios-app

Fish Prasadam Distribution:హైదరాబాద్: చేప మందు ప్రసాదం పంపిణీలో విషాదం!

Fish Prasadam Distribution: ఏటా మాదిరిగానే ఈసారి మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది.

Fish Prasadam Distribution: ఏటా మాదిరిగానే ఈసారి మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది.

Fish Prasadam Distribution:హైదరాబాద్: చేప మందు ప్రసాదం పంపిణీలో విషాదం!

ఏటా హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు ప్రసాదం పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేప మంది పంపిణీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్తమా, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు ఈ చేప ప్రసాదం వితరణ చేస్తుంటారు. ఏటా మృగశిర కార్తెక  సందర్భంగా ఈ ప్రసాదం పంపిణీ జరుగుతుంటుంది. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా మృగశిర కార్తెక సందర్భంగా ప్రసాద పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నేడు జరుగుతున్న చేప మందు ప్రసాద పంపిణీ విషాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఏటా మాదిరిగానే ఈసారి చేపల మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారికి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 8వ ఉదయం 11 గంటలకు ఈ చేప మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.  చేప మందు ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. ఉదయం6 గంటల నుంచి భారీగా జనం ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకున్నారు. ఇక చేప మందు పంపిణీ కార్యక్రమంలో భారీగా ప్రజలు రావడంతో స్వల్ప తోపులాట జరిగింది.

చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో ఓ విషాదం చోటుచేసుకుంది.నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన రాజన్న (57) మరణించాడు. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాజన్న క్యూలైన్ లో నిలబడి ఉన్నాడు. చేప మంది పంపిణీ ప్రారంభించే సమయానికి రద్దీ బాగా పెరిగింది. దీంతో అక్కడ ఉన్న క్యూలైన్ లో లోపులాట జరగడంతో రాజన్న స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను సమీపంలోని కేర్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇదే సమయంలో చికిత్స పొందుతూ రాజన్న మరణించాడు.

శనివారం ఉదయం 9గంటలకు ప్రారంభమైన చేప మందు పంపిణీ కార్యక్రమం.. 24గంటలపాటు సాగుతుంది. అంటే తిరిగి ఆదివారం ఉదయం 9 గంటల వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఈ చేప మందు పంపిణీ కార్య్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ లు ప్రారంభించారు. కొన్నేళ్ల నుంచి బత్తిని శివరామ గౌడ ఫ్యామిలీ చేప ప్రసాద పంపిణీ చేస్తుంది. మధ్యలో కోవిడ్‌ కారణంగా చేప ప్రసాదం పంపిణీ రెండేళ్ల పాటు నిలిచిపోయింది. అనంతరం గతేడాది నుంచి చేప ప్రసాద పంపిణీకి తిరిగి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది.