iDreamPost
android-app
ios-app

HYDలో భారీగా తగ్గిన ఇళ్లు ధరలు.. ఆ ఎఫెక్టే కారణం

  • Published Sep 21, 2024 | 11:43 AM Updated Updated Sep 21, 2024 | 11:43 AM

నగరంలో ఎప్పుడు లేని విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బ తిన్నది. ముఖ్యంగా అమ్మకాలు,కొనుగోళ్లు ప్రక్రియ మాత్రమే కాకుండా.. ధరలు కూడా భారీగా తగ్గాయి. ఇంతకీ నగరంలో ఇళ్ల స్థలాలు తగ్గిపోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తినడానికి కారణమేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నగరంలో ఎప్పుడు లేని విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బ తిన్నది. ముఖ్యంగా అమ్మకాలు,కొనుగోళ్లు ప్రక్రియ మాత్రమే కాకుండా.. ధరలు కూడా భారీగా తగ్గాయి. ఇంతకీ నగరంలో ఇళ్ల స్థలాలు తగ్గిపోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తినడానికి కారణమేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Sep 21, 2024 | 11:43 AMUpdated Sep 21, 2024 | 11:43 AM
HYDలో భారీగా తగ్గిన ఇళ్లు ధరలు.. ఆ ఎఫెక్టే కారణం

సాధారణంగా ఇల్లు, స్థలం కొనాలని ప్రతిఒక్కరూ ఆశ పడుతుంటారు. అది కూడా హైదరాబాద్ వంటి మహానగరంలో కొనాలనేది చాలామంది డ్రీమ్.కానీ, నగరంలో ఇళ్లు కొనాలంటే చిన్న మాట కాదు. ఇక్కడ స్థలాలైనా, ఇళ్లులైనా లక్షల్లో కాదు, కోట్లలో ఉంటాయి. కనుక ఇళ్లు కొనుక్కోవాలనే డ్రీమ్ ను నేరవేర్చుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇలా కష్టపడిన మొత్తాన్ని దాచుకొనే, లేక లోన్ తీసుకొనే చాలామంది ఇళ్లు లేదా స్థలం కొంటుంటారు. అందుకే నగరంలో ఇళ్లు,స్థలాలకే కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా మంచి డిమాండ్, ఆదాయం ఉంటుంది. కానీ, తాజాగా నగరంలో ఎప్పుడు లేని విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బ తిన్నది. ముఖ్యంగా అమ్మకాలు,కొనుగోళ్లు ప్రక్రియ మాత్రమే కాకుండా.. ధరలు కూడా భారీగా తగ్గాయి. ఇంతకీ నగరంలో ఇళ్ల స్థలాలు తగ్గిపోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తినడానికి కారణమేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నగరంలో గతకొన్ని రోజులుగా అక్రమదారులకు హైడ్రా ఏ స్థాయిలో హడలెత్తిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నగరంలోని చెరువులు, కుంటు, ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌జోన్లు, నాలాలు, ప్రభుత్వ పార్కులు అని తేడా లేకుండా..  ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో సామన్యులు, ధనికులు అనే తేడా లేకుండా.. రూల్స్ భిన్నంగా ఉన్న అక్రమ నిర్మాణాలపై  నిర్ధాక్ష్యిణ్యంగా కూల్చేస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు ఏ ప్రాంతంపై హైడ్రా కూల్చివేయడానికి వస్తుందనని అక్రమదారులకు గుండెల్లో గుబులు పుడుతంది. దీంతో నగరంలో ఏ స్థాలం కొనాలన్నా, ఏ ఇళ్లు కొనాలన్నా ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు.

House rates are reduced into Hyd

 

ఎదుకంటే.. ఏ ఇళ్లు లేదా స్థలం ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌జోన్లలో ఉన్నాయో తెలియడం లేదనీ, ఒకవేళ ఆ స్థలాల్లో కొంటే.. హైడ్రా అక్రమంగా కొల్చేస్తుందని భయంతో నగరంలో ఇల్లు కొనాలంటే ఆసక్తి చూపించడం లేదు.  దీంతో నగరంలో హైడ్రా ఎఫెక్ట్ తో.. ఇళ్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక నగరంలో ఈ కొనుగోలు, అమ్మకాలు ప్రకియ తగ్గిపోవడంతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పూర్తిగా దెబ్బ తిన్నది. అంతేకాకుండా.. నగరంలో పలు ప్రాంతాల్లోని ఇళ్లు, స్థలాల ధరలు కూడా తగ్గాయి.  కనుక ఎవరైనా ఇళ్లు లేదా స్థలాలు కొనాలని ఆలోచనలో ఉంటే.. ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. ఒకవేళ నిజంగా కొనాలనుకునే వారు  అన్నీ పర్మిషన్స్ ను సరిగ్గా చూసుకొని కొనుగోలు చేస్తే హైడ్రా నుంచి ఎటువంటి టెన్షన్, భయం అనేది ఉండదని చెప్పవచ్చు. మరి, నగరంలో హైడ్ర ఎఫెక్ట్ తో ఇళ్లు, స్థలాలు ధరలతో పాటు కొనుగోళ్లు, అమ్మకాలు ప్రక్రియ తగ్గిపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.