iDreamPost
android-app
ios-app

వీడియో: తండ్రికి తగ్గ తనయడు.. ఫస్ట్ టైమ్ పబ్లిక్ స్పీచ్ తో అదరగొట్టిన హిమాన్ష్

వీడియో: తండ్రికి తగ్గ తనయడు.. ఫస్ట్ టైమ్ పబ్లిక్ స్పీచ్ తో అదరగొట్టిన హిమాన్ష్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు తండ్రిలాగే ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొడతాడని అందరికీ తెలుసు. మరి.. అదే హిమాన్షు తెలుగులో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా చూశారు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో హిమాన్షు మొట్టమొదటగా పబ్లిక్ లో స్పీచ్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎక్కడా కూడా తడబడకుండా అచ్చం తండ్రిలాగే తెలుగు స్పీచ్ తో అబ్బురపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, కేటీఆర్ కొడుకు హిమాన్షు గొప్ప మనసు చాటుకున్న విషయం తెలిసిందే. గౌలిదొడ్డిలోని కేశవనగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నాడు. గతంలో ఒకనొక సందర్భంలో హిమాన్షు ఈ స్కూల్ ను విజీట్ చేశాడు. అప్పుడు ఈ పాఠశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కలత చెందాడు. దీంతో ఆ స్కూల్ ను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాడు హిమాన్షు. అధునాతన హంగులతో ఈ స్కూల్ ను తీర్చుదిద్దాలని భావించాడు. దీని కోసం హిమాన్షు ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో భాగంగానే హిమాన్షు గత రెండేళ్ల నుంచి దగ్గరుండి ఆ స్కూల్ పనులను పర్యవేక్షించాడు. ఇక మొత్తానికి ఆ స్కూల్ పనులు కూడా పూర్తయ్యాయి.

ఇదిలా ఉంటే.. హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, హిమాన్షు తదితర అధికారుల సమక్షంలో ఈ స్కూల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ కొడుకు హిమాన్షు మొట్టమొదటగా పబ్లిక్ స్పీచ్ తో అదరగొట్టి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. ఎక్కడా కూడా తడబడకుండా అచ్చం తండ్రిలాగే తెలుగులో స్పీచ్ తో అందరినీ అబ్బురపరిచాడు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: వీఆర్‌ఏ, జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలకు KCR గుడ్‌ న్యూస్‌.. వారి కోసం కీలక నిర్ణయం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి