iDreamPost
android-app
ios-app

KTR: ఆ ఛానెల్స్‌కు KTR హెచ్చరిక! యూట్యూబ్‌కి ఫిర్యాదు చేస్తామంటూ..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామరావు సోషల్ మీడియలో ఓ పోస్టు పెట్టారు. పలు య్యూటూబ్ ఛానల్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామరావు సోషల్ మీడియలో ఓ పోస్టు పెట్టారు. పలు య్యూటూబ్ ఛానల్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

KTR: ఆ ఛానెల్స్‌కు KTR హెచ్చరిక! యూట్యూబ్‌కి ఫిర్యాదు చేస్తామంటూ..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పలు య్యూటూబ్ ఛానళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని అసత్యలను పదే పదే ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేస్తున్నారని తెలిపారు. ట్విట్టర్ వేదికగా పలు య్యూటూబ్ ఛానల్స్ కి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇటీవల తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం  ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కవితను పోలీసులు అరెస్టు చేసి..రిమాండ్ కి తరలించారు. అలానే ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ ను సైతం ఈ కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో ఈ లిక్కర్ స్కాం అంశంపై అన్ని మీడియాల్లో వివిధ కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు, య్యూటూబ్ ఛానల్స్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సింది పోయి.. అసత్య కథనాలను అల్లి..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

కొన్ని య్యూటూబ్ ఛానల్స్ అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో పచ్చి అబద్దాలను చూపిస్తున్నాయంటూ ఆయన పోస్టు చేశారు. గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయని ఘాటూగా రాసుకొచ్చారు. ఇది వ్యక్తిగతంగా తనతోపాటు, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నామని ఆయన తెలిపారు. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

గతంలో తమపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, కథనాలను ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కేటీఆర్ ట్విట్టర్ ప్రస్తావించారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామంటూ కేటీఆర్ పోస్టు చేశారు. అసత్య వార్తలను ప్రచారం చేసే యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం  కేసు పెడతామని, అలానే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఇలా కేవలం ఫిర్యాదులే కాకుండా ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్ కి ఫిర్యాదు కూడా చేస్తామంటూ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే, కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలని  హెచ్చరిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. మరి..కొన్ని య్యూటూబ్ ఛానల్స్ ను ఉద్దేశిస్తూ కేటీఆర్ చేసిన ట్విట్టర్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.