అవసరమైతే MLA పదవికి రాజీనామా చేస్తా.. KTR సంచలన వ్యాఖ్యలు!

KTR Sensational Comments: గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అధికార పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

KTR Sensational Comments: గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అధికార పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల తెలంగాణాలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాభిష్టం మేరకు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల పాలన‌లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం చుట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. నాటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. అధికార పార్టీపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చేనేత కార్మికులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని,తీవ్ర సంక్షోభంలో పడ్డారని విమర్శించారు. ఆర్ధిక ఇబ్బందులు భరించలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..

సిరిసిల్లలోని వెంకంపేటలో ఆర్థిక ఇబ్బందులతో  బైరి అమర్, స్రవంతి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు.  బాధిత కుటుంబానికి రూ.10 లక్షల వరకు  పరిహారాన్ని అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కోరారు. గడిచిన 11 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 34 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో ఒక్క సిరిసిల్లలోనే 20 మంది బలవర్మణానికి పాల్పపడ్డారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ప్రతి సంవత్సరం తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇస్తూ వచ్చింది. ప్రభుత్వం బతుకమ్మ చీరలకు ఆర్డర్స్ ఇచ్చి నేతన్నకు వెన్నుదన్నుగా నిలిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల ఆర్డర్లు ఆపేయడంతో చేనేత కళాకారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బతువుకుదెరువు లేక కుటుంబాలను పోషించుకోలని పరిస్థితిలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు.

ఒక్క సిరిసిల్లపైనే ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత పగ, కోపం అని ప్రశ్నించారు. మీడియా సాక్షిగా రేవంత్ రెడ్డిని ఒక్కటే కోరుతున్నా.. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటమే మీకు అడ్డు అనిపిస్తే.. ఆ పదవికి రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నాను. ఆ తర్వాత అయినా సిరిసిల్లపై దృష్టి పెట్టాలని కోరుతున్నా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల హామీలు ప్రతి ఒక్కటీ నెరవేర్చాడనికి ప్రయత్నించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే మరోసారి ఉద్యమాన్ని మొదలు పెడతామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం పలు సంక్షేమా పథకాలు, అభివృద్ది కార్యక్రమాల పేరుతో వేల కోట్లు దుర్వినియోగం చేసిందని అధికార పార్టీ ఆరోపిస్తుంది. వాటన్నింటిని ఇప్పుడు ప్రక్షాళన చేసే పనిలో ఉన్నామని.. అది బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడటం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుంది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ నెరవేరుస్తూనే వస్తుంది.. అది ప్రతిపక్ష నేతలు కూడా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చి తెలంగాణ అభివృద్దికి మరింత కృషి చేస్తామని అంటుంది రేవంత్ సర్కార్. చేనేత కార్మికుల పేరు చెప్పుకొని ప్రతిపక్ష పార్టీ మరో కథ అల్లుతుందని విమర్శిస్తున్నారు అధికార పార్టీ నేతలు. చేనేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకోవడానికి తమ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని, ఆత్మహత్యల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ రాజీనామా అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం ఎంత వరకు పోతుందో వేచి చూడాలి.

Show comments