P Krishna
KTR Sensational Comments: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
KTR Sensational Comments: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
P Krishna
ఇటీవల తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ కి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. ఇదిలా ఉంటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వలసల పర్వం కొనసాగుతుంది. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీలోకి బీఆర్ఎస్ సీనియర్ నేతలు వలస వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు పలువురు నేతలు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించి కష్టకాలంలో అండగా ఉండాల్సిన సీనియర్ నేతలు కేకే, కడియం పార్టీ మారడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు. కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది అని అన్నారు.
ఈ రోజు నాయకులు పార్టీని వదిలేసినా.. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలను అధినేత ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని అన్నారు. వారిని నేను స్వయంగా కలిసి పనిచేస్తాను అని అన్నారు. రంజీత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారు. రంజీత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలు కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ చేసిన తర్వాత నవ్వుకుంటూ హేళన చేశారు. వీరిద్దరూ కేసీఆర్ కాళ్లు పట్టుకొని వేడుకున్నా మళ్లీ పార్టీలోకి రానివ్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేలా అందరూ పనిచేయాలని అన్నారు.