Dharani
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..
Dharani
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ప్రాధాన పార్టీలన్ని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ.. ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఇక తెలంగాణలో ఎన్నికల హీటు మాములుగా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎలక్షన్‌లో కూడా తన హవా కొనసాగించాలని తీవ్రంగా కృషి చేస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం.. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని బలంగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అధికార, విపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. హీటు రాజేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చనున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూన్ 2 వరకే హైదరాబాద్ నగరం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తారంటూ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరిందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చకుండా.. అడ్డుకున్నది కేవలం బీఆర్‌ఎస్ పార్టీనే అని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అంతేకాక బీజేపీ అరాచకాలను అడ్డుకునే శక్తి కేవలం బీఆర్ఎస్‌కు మాత్రమే ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటామని తెలిపారు. ఇందుకోసం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ జనాలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
2026 నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ (డీలిమిటేషన్)లో తెలంగాణకు అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి కేవలం బీఆర్ఎస్‌కు మాత్రమే ఉందన్నారు కేటీఆర్. అలానే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చకుండా ఆపే శక్తి కూడా బీఆర్ఎస్‌కే ఉందన్నారు. ఏడాదిలోపు తెలంగాణను మళ్లీ కేసీఆర్ శాసించే రోజులు రావాలంటే.. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మళ్లీ తెలంగాణను శాసిస్తాడంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశం ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపనుంది.