iDreamPost
android-app
ios-app

కొడుకును తలచుకుని KTR ఎమోషనల్‌.. నాలో సగం దూరమవుతోందంటూ

  • Published Aug 20, 2023 | 12:25 PM Updated Updated Aug 20, 2023 | 12:25 PM
  • Published Aug 20, 2023 | 12:25 PMUpdated Aug 20, 2023 | 12:25 PM
కొడుకును తలచుకుని KTR ఎమోషనల్‌.. నాలో సగం దూరమవుతోందంటూ

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌.. ఇటు రాజకీయాల్లో, అటు సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకుంటే.. ఇక సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. సమస్యలపై తక్షణమే స్పందిస్తూ.. పరిష్కారాలు చూపుతూ.. ఇక్కడ కూడా తనదైన ముద్ర వేస్తూ.. ఎంతోమంది సోషల్‌ ఫాలోవర్లును సంపాదించుకున్నారు కేటీఆర్‌. సామాజిక, స్ఫూర్తిదాయక అంశాలు, సమస్యలకు పరిష్కారం మాత్రమే కాక తన కుటుంబం, వ్యక్తిగత అంశాల గురించి కూడా పోస్ట్‌ చేస్తుంటారు కేటీఆర్‌. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్‌ ఎక్స్‌(ట్విట్టర్‌)లో కుమారుడు హిమాన్షుని తలచుకుని ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ప్రసుత్తం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..

మంత్రి కేటీఆర్ తనయుడు కల్వంకుట్ల హిమాన్షు రావు ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లాడు. కొన్ని రోజుల క్రితమే ఇంటర్మీడియట్‌ను పూర్తి చేసుకున్న హిమాన్షు.. ఉన్నత చదువుల కోసం శనివారం రాత్రి అమెరికా బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో హిమాన్షు తండ్రి కేటీఆర్‌, తల్లి శైలిమ, చెల్లెలు అలేఖ్యతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుని తలచుకుని ఒకింత ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ సందర్భంగా కేటీఆర్‌.. ‘‘మొన్నటి వరకు అల్లరిగా తిరిగిన పిల్లాడు అప్పుడే పెద్దయి కాలేజీకి వెళ్తున్నాడంటే… నమ్మలేకపోతున్నాను. హిమాన్షు ఒంటిరిగా అమెరికా వెళ్లటం లేదు.. నాలోని సగ భాగాన్ని తీసుకెళ్తున్నాడంటూ’’ కొడుకుకు సంబంధించిన ఫొటోలని షేర్‌ చేస్తూ.. భావోద్వేగానికి లోనయ్యాడు కేటీఆర్‌. అంతేకాక తండ్రిగా తన విధులను కూడా నిర్వర్తించాల్సి ఉందని, వారం రోజుల పాటు కుటుంబంతో గడిపేందుకు అమెరికాకు బయలుదేరానని చెప్పుకొచ్చారు కేటీఆర్‌.

ఇక వారం రోజుల పాటు అగ్రరాజ్య పర్యటనలో భాగంగా కేటీఆర్‌.. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా న్యూయార్క్, చికాగోలో పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల అధిపతులతో సమావేశం అవుతారు. మంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. పర్యటన చివర్లో హిమాన్షును అమెరికా యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులో చేర్పించనున్నారు. ఆ తర్వాత అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసి.. స్వదేశానికి తిరిగి వస్తారు కేటీఆర్‌.

ఇక హిమాన్షు.. గ‌చ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంట‌ర్నేష‌న్ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ను చదువుకున్నారు. ఇటీవల గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌ల్లో అతడు పట్టాను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత సీఎం కేసీఆర్, నాయనమ్మ శోభ, తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, చెల్లి అలేఖ్య హాజరయ్యారు.