iDreamPost
android-app
ios-app

శుభవార్త.. రుణమాఫీపై కేటీఆర్‌ కీలక ప్రకటన!

  • Published Oct 21, 2023 | 12:56 PM Updated Updated Oct 21, 2023 | 12:56 PM

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది.. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది.. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.

  • Published Oct 21, 2023 | 12:56 PMUpdated Oct 21, 2023 | 12:56 PM
శుభవార్త.. రుణమాఫీపై కేటీఆర్‌ కీలక ప్రకటన!

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్.. 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉండబోతున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. అధికార పార్టీ బీఆర్ఎస్ తరుపు నుంచి సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ తరుపు నుంచి మొదటి విడతగా జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బసు యాత్రతో నేతల్లో జోష్ నింపారు. ఇలాంటి సమయంలో రైతుల రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు మంత్రి కేటీఆర్.

తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాలను పరిష్కరించడానికి అలాగే.. వారికి అవసరమైన ఉపశమనాన్ని అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిబద్దతతో ఉందని ఈ క్రమంలోనే రైతు రుణ మాఫీకి సంబంధించి కేసీఆర్ చేసిన ప్రకటన అందరినీ ఆకర్షించింది. గతంలో వ్యవసాయ సమాజాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం చురుకైన విధానాన్ని అవలంభిస్తుందని అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు మంత్రి కేటీఆర్. శాసనసభ ఎన్నికలు జరిగే లోపు మిగతా రైతుల రుణమాఫీ కూడా పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎవరూ చేయని విధంగా రెండు సార్లు రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని అన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు కింద అన్నదాతల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమ చేశామని అన్నారు.

లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. గతంలోనే రూ.35వేల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన సర్కార్, మిగిలిన రుణాలకు సంబంధించిన మాఫీ ప్రక్రియ ఆగస్టు 3 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో కాకముందే ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో కోడ్ అమల్లోకి రావడంతో మిగిలిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రైతు రుణాల 19 వేల కోట్ల రూపాయలు ఉండగా.. ఇప్పటి వరకు రూ.13 నుంచి 14 వేల కోట్ల రుపాయలు బ్యాంక్యులకు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో బ్యాంకులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ రుణ మాఫీ కింద 5 లక్షలకు పైగా రైతులు లబ్ది పొందే అవకాశం ఉంది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం అందిస్తామని అన్నారు.