iDreamPost
android-app
ios-app

షాదాబ్ బిర్యానీ, మెట్రో ప్రయాణం.. KTR సర్ ఇదే మాకు కావాల్సింది!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చాలా హోరాహోరీగా జరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ కొత్త రకం ప్రచారంతో ప్రజల వద్దకు వెళ్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చాలా హోరాహోరీగా జరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ కొత్త రకం ప్రచారంతో ప్రజల వద్దకు వెళ్తున్నారు.

షాదాబ్ బిర్యానీ, మెట్రో ప్రయాణం.. KTR సర్ ఇదే మాకు కావాల్సింది!

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి పీక్ స్టేజికి చేరుకుంది. పోలింగ్ కు మరికొద్ది రోజులే ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. పార్టీలన్ని సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అయితే ప్రచారంలో కొత్త రకం ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ నాంది పలికారు. ఇప్పటి వరకు అందరూ నేతలు చేసే ఎన్నికల ప్రచారానికి భిన్నంగా కేటీఆర్ కొత్త రకం ప్రచారం ప్రారంభించారు. ఇటీవలే కేటీఆర్ చేస్తున్న పర్యటనలు చూస్తేనే మనకు అర్ధమవుతుంది.. ఆయన కొత్త రకం ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్తున్నారని.

సాధారణంగా ఎన్నికలు అనగానే రాజకీయ పార్టీలు, నేతలు జెండాలు పట్టుకుని, జనాలను పోగేసుకుని ప్రచారానికి వెళ్తుంటారు. బైక్, కార్ల ర్యాలీలతో గల్లీలో, గ్రామాల్లోకి వెళ్లి.. ప్రజలను ఓట్లు అడుగుతుంటారు. అంతేకాక భారీగా సభలు ఏర్పాటు చేసి.. ప్రజలను  ఆకర్షించే ప్రసంగాలు చేస్తుంటారు. నృత్యాలు, తప్పట్లు, కోలాటం వంటివి చేస్తూ రాజకీయ నేతలు ప్రజల వద్దకు వెళ్తుంటారు. ఎప్పటి నుంచి ఎన్నికల ప్రచారం అంటే ఇదే మాదిరిగా సాగుతుండేది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలానే అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే గులాబీ నేత కేటీఆర్ మాత్రం ప్రచారంలో కొత్త పథంలో వెళ్తున్నారు. గుంపులుగా జనాలను పోగేసుకుని, ఆర్భంటం చేయకుండా చాలా సాదాసీదా ప్రజలతో మమేకవుతున్నారు.

ఇటీవల మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రచారాలాను గమనిస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీఆర్  కొత్త మార్క్ ట్రెండ్ సెట్ చేశారు. ఇటీవలే షాదాబ్ బిర్యానీ తిని.. అక్కడే ప్రజలతో ముచ్చటించారు. ఆ తరువాత నిలోఫర్ కేఫ్ లో చాయ్ తాగి అక్కడి జనాలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి చాయ్ తాగుతూ చాలా సమయం పాటు ముచ్చటించారు.

ప్రభుత్వం చేసిన పనులు వివరించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే శుక్రవారం కూడా  రాయదుర్గం మెట్రో స్టేషన్లో రైలు ఎక్కి..బేగంపేట్ వరకు ప్రయాణించారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి కేటీఆర్ మెట్రోలో ప్రయాణం చేశారు.  వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు హైదరాబాద్ ఎలా మారిందో వారి నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేయాలంటే మరోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను వారికి వివరించారు.

ఇలా వివిధ ప్రాంతాల్లో నేరుగా ఆయనే వెళ్లి ప్రజల్లో కలిసిపోయి.. సరికొత్త ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇలానే కాకుండా ఇటీవల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులతో చర్చాగోష్టి పెట్టి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాల భర్తీలో ఏం చేయాలో వారి నుంచి సలహాలు తీసుకున్నారు. ఇలా వారిలోని అసమ్మతిని తొలగించే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 4న మరోసారి సమావేశం అవుదామని ఆయన హామి ఇచ్చారు.

ఇలా కేటీఆర్ కొత్త రకం  ఎన్నికల ప్రచారానికి తెరదించారు. సామాన్యులు సైతం కేటీఆర్ ప్రచారంపై పాజిటీవ్ గా స్పందిస్తున్నారు. జనాలను గుంపులు చేసి.. ఎన్నికల ప్రచారం చేయడం కాకుండా, జనాల వద్దకే వెళ్తే..స్పందన వేరేలా ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కేటీఆర్ చేస్తున్న ఈ భిన్నమైన ఎన్నికల ప్రచారాన్ని చూసి..ఇదే కదా మాకు కావాల్సింది సార్ అంటూ  అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి.. కేటీఆర్ చేస్తున్న కొత్త రకం ఎలక్షన్ క్యాంపెయిన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.