iDreamPost
android-app
ios-app

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టు.. ED అధికారులతో KTR వాగ్వాదం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎంఎల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు కవితకు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ కేసుో కవితను ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంఎల్సీ కవితకు బిగ్ షాకిచ్చింది. నేడు కవిత ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులు కవితకు అరెస్టు వారెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. కవితను ఇదే రాత్రి ఢిల్లీకి తరలించనున్నారు. అయితే కవిత అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు కవిత నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. కవిత అరెస్టుపై కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నించారు. ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారని ఈడీ అధికారులను అడిగారు కేటీఆర్.

సుప్రీంకోర్టులో అండర్ టేకింగ్ ఇచ్చి ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ అధికారులను ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉండగా ఈడీ చర్యలు సరికాదన్నారు కేటీఆర్. తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని ఈడీ అధికారులను అడిగారు. కవితను అరెస్టు చేసిన ఈడీ మరికాసేపట్లో ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో కవితను తీసుకెళ్లే రూట్ ను పోలీసులు క్లియర్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.